twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు శంకర్‌, ప్రఖ్యాత దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి......ఓ తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. 'సీమటపాకారు' ఫేమ్‌ పూర్ణ కథానాయిక. 'తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ' టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ప్రేమకు వ్యతిరేకం అనే విధంగా రూపొందుతున్న ఈచిత్రం ప్రేమికుల రోజు రోజున ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం.

    ఈ చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. 'దండుపాళ్య' నిర్మాత నారాయణ్‌బాబు నిర్మాత. యాపిల్‌ బ్లోస్సమ్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి గాయని వసుందరాదాస్‌ క్లాప్‌ ఇవ్వగా, సీతారామశాస్త్రి స్విచ్చాన్‌ చేశారు. పి.వాసు గౌరవ దర్శకత్వం వహించారు.

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    ‘తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ' చిత్రానికి క్లాప్ కొడుతున్న గాయని వసుందరా దాస్

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    పి.వాసు తనయుడు శక్తి, పూర్ణ, సిరివెన్నెల తనయుడు శంకర్

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    తమ వారసులతో పి వాసు, సిరివెన్నెల

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమ దృశ్యం

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    తనయుడు శక్తితో పి. వాసు

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    శక్తి, పూర్ణ, శంకర్

    సిరివెన్నెల, పి. వాసు వారసులు...ప్రేమకు వ్యతిరేకంగా!(ఫోటోలు)

    ‘తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ' పోస్టర్

    అనంతరం సీతారామశాస్త్రి మాట్లాడుతూ, టైటిల్‌లోనే గమ్మత్తు ఉంది. కన్నడ నిర్మాతలు తెలుగులోకి వస్తున్నారు. కన్నడ, తమిళంలో దర్శకునిగా పనిచేసిన రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్‌ సమకాలీకుడు పీతాంబరం తనయుడుపి.వాసు. ఆయన తనయుడు, నా బిడ్డ హీరోలుగా నటిస్తున్నారు. పిల్లల కెరీర్‌ విషయంలో స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తున్నాం' అన్నారు.

    పి.వాసు మాట్లాడుతూ, తెలుగు సినిమాలకు కథలిచ్చాను. దర్శకత్వం వహించా. పరిశ్రమ హైదరాబాద్‌ తరలిరావడం తమిళపరిశ్రమకు నష్టం. తెలుగువారి అభిరుచి, కళానిపుణత గొప్పది. అదంతా చిన్నప్పుడే నాన్న పీతాంబరంతోపాటు ప్రత్యక్షంగా చూశాను. అందుకే తెలుగంటే చాలా ఇష్టం' అన్నారు. ఎవరూ ప్రయత్నించని, కొత్తకోణంలో ప్రేమకథను తెరకెక్కిస్తున్నానని దర్శకుడు తెలిపారు. తెలుగులో తమకిది తొలిచిత్రమని నిర్మాతలు తెలిపారు. అలీ, బ్రహ్మానందం, నిషా కొఠారి, నాగబాబు, సీత, షిండే, సితార తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: పికెహెచ్‌. దాస్‌, సంగీతం: మణిశర్మ, మాటలు: రాఘవ, రాఘవ టి, కథ, కథనం, దర్శకత్వం: రాఘవ.

    English summary
    'Telugulo Naku Nachani Padam Prema' movie launched at Ramanaidu Studios, Hyderabad. Shakthi Vasu, Poorna, Raja Bhavani Shankar Sharma are playing main lead roles in the film. Raghava is director of the film. Vasundhar Das, SS Vasan, Narayana Babu, Poornima Narayan, PKH Das, Sirivnnela Seetharama Sastry and many others participated at the new movie opening function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X