రచ్చ రంబోలా: ఆటో వాలా జూ. ఎన్టీఆర్(ఫొటో)
హైదరాబాద్ : ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కలిసి ఆటోలో కూర్చుని ఏం డిస్కస్ చేస్తున్నారో...పూరి షాట్ చెప్తూంటే...అది ఇలా చేయనా...అలా చేయనా అని అడుగుతున్నట్లు ఉంది కదూ. గతంలో ఆంధ్రావాలా గా ఎన్టీఆర్ చూపిన పూరి జగన్నాథ్ ఈసారి ఇలా ఆటో ఎక్కించి ఆటోవాలాని చేసారు. అవుట్ డోర్ లొకేషన్ లో ఓ కీ సీన్ కుసంభందించిన వర్కింగ్ స్టిల్ ఫొటో ఇది. జనవరి 20 వరకూ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది.
https://www.facebook.com/TeluguFilmibeat
పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాద్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ప్రతిష్ట్టాత్మాకంగా నిర్మిస్తున్న టెంపర్ మూవీ టీజర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ దయా అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా నటి కాజల్ అగర్వాల్ జతకట్టింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను టీజర్ ని న్యూ ఇయిర్ సందర్భంగా విడుదల చేశారు.

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర'.. ఇది దయాగాడి దండయాత్ర'అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌తో విడుదల చేసిన టీజర్‌కి చక్కని స్పందన వస్తోంది. ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ కొత్తగా ఉందని ప్రేక్షకులు, అభిమానులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. టీజర్ రిలీజ్ తరువాత సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది'' అని బండ్ల గణేశ్ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌తో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతకు మించి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎన్టీఆర్, పూరి, నా కెరీర్‌లో ‘టెంపర్' పెద్ద హిట్ అవుతుంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు.
టెంపర్ చిత్రం ఆడియో ఈనెల 18న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూఇయర్ వేడుకగా ప్రేక్షకులకు టెంపర్ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే రెండు లక్షలకుపైగా క్లిక్స్ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని కొన్ని లోకేషన్లలో ఎన్టీఆర్-కాజల్‌లపై దర్శకుడు పూరిజగన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా..ఫిబ్రవరి మొదటివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











