twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ అయోమయం! ఎన్టీఆర్ బాధను దిగమింగాడంటూ..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హరికృష్ణ పెద్ద కుమారుడు, సినీ నిర్మాత అయిన నందమూరి జానకిరామ్ యాక్సిండెటులో మరణించడంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు విషాదంలో ఉన్నారు. సోదరుడు జానకిరామ్ మరణంతో జూ ఎన్టీఆర్ తీవ్రమైన బాధలో ఉన్నారని, ఆయన షూటింగులో పాల్గొనే పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలో ‘టెంపర్' షూటింగ్ 10 రోజుల పాటు నిర్మాత నిలిపివేసినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరిగింది.

    ఆ ప్రచారం అలా ఉంటే ‘టెంపర్' మూవీ ఫేస్ బుక్ అఫీషియల్ పేజీలో రేపటి నుండి షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటూ అప్ డేట్ చేసారు. దీంతో ఎన్టీఆర్ షూటింగులో పాల్గొంటాడా? లేదా? లేక ఇతర తారాగణంతో మిగిలిన షూటింగ్ జరుగుతుందా? అనే అయోమయంలో పడ్డారు ఫ్యాన్స్.

    Temper - Movie Shooting will resume from tomorrow!

    ఓ అభిమాని....‘అది టైగర్ అంటే బాధను దిగమింగుకుని మరలా అపుడే షూటింగుకు రెడీ అయ్యారు' అంటూ అభిప్రాయ పడ్డాడు. యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

    కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Temper - Movie official facebook page stated that Shooting will resume from tomorrow!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X