ఇంకా షురూ కాలేదు: ‘టెంపర్’ మరింత ఆలస్యం!
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మరణంతో జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్' షూటింగ్ ఆగి పోయిన సంగతి తెలిసిందే. సోదరుడి మరణం నుండి కోలుకోవడానికి జూ ఎన్టీఆర్ కు చాలా సమయం పట్టింది. ఆయన షూటింగుకు హాజరు కాని కారణంగా షూటింగ్ షెడ్యూల్ అస్తవ్యస్తమైంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ రోజు నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ....ఇతర ముఖ్య ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల షూటింగ్ మళ్లీ పోస్టుపోన్ అయినట్లు తెలుస్తోంది. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది.

శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ బ్రేక్ లేకుండా సాగి ఉంటే జనవరి 9 సినిమా విడుదలయ్యేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఫిబ్రవరి 5 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications