బండ్ల గణేష్ గగ్నమ్ డాన్స్... ( ‘టెంపర్’ సక్సెస్ పార్టీ ఫొటోలు)
హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పించిన సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా మొన్న శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసారు నిర్మాత బండ్ల గణేష్ మరియు పూరి జగన్నాధ్. పూరి జగన్నాథ్ ఆఫీసు కేవ్ లో జరిగిన ఈ పార్టీలో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, వక్కంతం వంశీ, బండ్ల గణేష్, మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సక్సెస్ పార్టీ లో భాగంగా కేకుని కోసారు. అంతేకాక ఉత్సాహంగా బండ్ల గణేష్ ..గగ్నమ్ డాన్స్ ని అందుకున్నారు. ఈ పార్టీలో అంతా జోష్ గ పాల్గొన్నారు. టెంపర్ విజయోత్సాహం వీరిందరనీ సంతోషంలో ముంచెత్తిందని ఈ ఫొటోలు చూస్తే మీకు అర్దమవుతుంది.
ఫొటోలు ..స్లైడ్ షో లో...

పార్టీ...
టెంపర్ హిట్ టాక్ రావంటంతో పూరి క్యాప్ లో నూతనోత్సాహం వెల్లి వివిసింది. దీన్ని పార్టీలతో సెలబ్రెట్ చేసుకుంటున్నారు

నిర్మాతగా
నిర్మాతగా బండ్ల గణేష్ తాను సాలిడ్ హిట్ కొట్టానని అంటున్నారు.

ఎన్టీఆర్ జోష్
గత కొంతకాలంగా ఎన్టీఆర్ కు సరైన హిట్ పడలేదు. దాంతో ఈయన ఈ చిత్రం హిట్ ని ఓ రేంజిలో అస్వాదిస్తున్నారు.

పూరి సైతం
పూరి కు గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ హిట్ లు రావటం లేదు. హార్ట్ ఎటాక్ చిత్రం సైతం జస్ట్ ఓకే అనిపించుకుంది.

రామ్ గోపాల్ వర్మ
ఈ పార్టీలో పూరి తన గురువు రామ్ గోపాల్ వర్మని పిలిచారు.

గణేష్ ఉత్సాహం
ఈ పార్టీలో ఎక్కువ సంతోషంగా గడిపి ఎంజాయ్ చేసింది బండ్ల గణేష్.

వక్కంతం వంశీ
రీసెంట్ గా వరస హిట్ లతో దూసుకుపోతున్న రైటర్ వక్కంతం వంశీకిది మరో హిట్.

కేకు కట్ చేసి మరి
ఈ సక్సెస్ పార్టీని కేకు కట్ చేసి మరీ ఎంజాయ్ చేసారు దర్సకుడు, నిర్మాత

మరో ప్రకటన
పనిలో పనిగా నిర్మాత ...టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు.

ఈ సినిమాలో..
ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

తొలి రోజు రికార్డు
ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది.

తెర వెనక, ముందు
కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











