వామ్మో....‘టెంపర్’ లేచిపోయే రెస్పాన్స్!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా సినిమా ‘టెంపర్' ఆడియో వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ విడుదలైన గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ కు 2.80 లక్షలకు హిట్స్ వచ్చాయి. మున్ముందు ఇది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికగా మారింది.

‘టెంపర్' ఆడియోతో పాటు....థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలను బీట్ చేసే విధంగా ‘టెంపర్' ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Temper Theatrical Trailer crossed 2.5 Million views

రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X