twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ విలన్ అరెస్ట్.. మూడోసారి అరెస్ట్‌.. సినీ పరిశ్రమలో కలకలం

    |

    టాలీవుడ్ విలన్, హిందీ బిగ్‌బాస్ ఫేం ఎజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. దాంతో మరోసారి బాలీవుడ్‌లో కలకలం రేగింది. గత కొద్ది నెలలుగా సినీతారలతో డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎజాజ్ ఖాన్ అరెస్ట్ విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    మెరుపు దాడులతో ఎన్సీబీ పంజా

    మెరుపు దాడులతో ఎన్సీబీ పంజా

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎన్సీబీ రంగంలోకి దిగింది. సుశాంత్ ఆత్మహత్యకు డ్రగ్స్ వ్యవహారం ప్రేరణగా నిలిచిందనే ఆరోపణలపై ఎన్సీబీ బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులపై పంజా విసిరింది. పలు సెలబ్రిటీల నివాసాలపై మెరుపు దాడులు నిర్వహించి అరెస్ట్‌లు చేసింది.

     రియా చక్రవర్తితపాటు పలువురి అరెస్ట్

    రియా చక్రవర్తితపాటు పలువురి అరెస్ట్

    బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అర్జున్ రాంపాల్, భారతీ సింగ్ దంపతులను విచారించింది. ఇలా దర్యాప్తు చేస్తూనే డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్న ఎజాజ్ ఖాన్‌ను మరోసారి అరెస్ట్ చేసింది.

     గతంలో ఎజాజ్ ఖాన్ అరెస్ట్

    గతంలో ఎజాజ్ ఖాన్ అరెస్ట్

    ఎజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. 2018లో నవీ ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎజాజ్ వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఎండీ డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. అయితే గతంలో మతపరమైన పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన చరిత్ర కూడా ఉంది. తాజాగా డ్రగ్ డీలర్ షాదాబ్ బటాటా అరెస్ట్‌తో మరోసారి ఎజాజ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. షాదాబ్ బటాటా కుమారుడు ఫరూక్ బటాటా నుంచి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ సాధీనం చేసుకోవడం సంచలనం రేపింది.

     తాజాగా డ్రగ్స్ డీలర్ అరెస్ట్‌తో

    తాజాగా డ్రగ్స్ డీలర్ అరెస్ట్‌తో

    షాదాబ్ బటాటా అరెస్ట్ తర్వాత ఎజాజ్ ఖాన్‌కు డ్రగ్స్ దందాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడింది. దాంతో రాజస్థాన్ నుంచి వచ్చిన ఎజాజ్ ఖాన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎజాజ్‌తో లోతైన విచారణ చేస్తున్నట్టు సమాచారం.

    ఎజాజ్ ఖాన్ కెరీర్ గురించి

    ఎజాజ్ ఖాన్ కెరీర్ గురించి

    ఎజాజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర, దడ, టెంపర్‌తోపాటు హిందీలో తను వెడ్స్ మను, జిల్లా ఘజియాబాద్, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రాల్లో నటించారు.

    English summary
    Bollywood actor, Temper villain Ajaz Khan arrested in Drug case. NCB arrested the actor in Mumbai Airport. After arrest of drug dealer Shadab Batata, Ajaz Khan name surfaced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X