బాలల చలనచిత్రోత్సవానికి ‘టెంపుల్ రన్’
హైదరాబాద్: ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యంతో తెరకెక్కించిన 'టెంపుల్ రన్' చిత్రం 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ఎంపికైంది. ఐసిఎఫ్ఎఫ్ జ్యూరీ కమిటీ ఈ చిత్రాన్ని నాన్ కాంపిటీటివ్ విభాగం కింద ఎంపిక చేసారు.
టెంపుల్ రన్ చిత్రం, ఆపదలో ఉన్న స్నేహితుడికి సహాయపడేందుకు నిధిని అన్వేషించే స్నేహితుల బృందం చివరకు ఏం చేసారు? అనే కథాంశంతో సాగుతుంది. పిల్లల్లో సహాయ పడే గుణం పెంపొందించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

చిరు మేధావుల అద్భుతం
బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిప్ సి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ....‘ఇది ఓక్రిడ్జ్‌లోని చిరు మేధావులు సాధించిన అద్భుత విజయం. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ, ఈ సృజనాత్మక కార్యక్రమం మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటుందని ఆశిస్తున్నాను' అన్నారు.

నటులు, దర్శకులు
ఈ చిత్రానికి 8వ గ్రేడ్‌కు చెందిన ఆకాష్, అహెలి, అంతర, శృతి దర్శకత్వం వహించారు. ఇందులో ఆర్య, అభిగ్య, నిశాంత్, కార్తీక్, స్ర్మితి, శ్రేయాస్, ఆకాష్, గోవింద్, శ్రీకర్ నటించారు.

నటనా నైపుణ్యం
ఈ చిత్రానికి ఆర్య తల్లి శ్రీమతి ఎక్తా వాజ్ పేయి నటనా నైపుణ్యాలను విద్యాలకు నేర్పించారు. ఈ విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ప్రదర్శన వివరాలు
ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెస్టివల్ జరిగే నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది.


Click it and Unblock the Notifications