twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రుద్రమదేవి : హైదాబాద్‌లో వేయి స్తంబాల గుడి సెట్

    By Bojja Kumar
    |

    Rudramma Devi
    హైదరాబాద్ : అనుష్క టైటిల్ రోల్‌లో 'రుద్రమదేవి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒక్కడు వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ బేనర్‌పై స్వీయనిర్మాణ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రాన్ని భారత దేశపు తొలి హిస్టారికల్ స్టిరియో స్కోపిక్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    ఏప్రిల్ 27న షూటింగ్ ప్రారంభం కాగా, గోపన్నపల్లిలోని వేసిన భారీ సెట్ వద్ద చిత్రీకరణ జరిపారు. తాగా సినిమా పోగ్రెస్ గురించి దర్శకుడు గుణశేఖర్ వివరిస్తూ....'సీతారామ శాస్త్రి రాసిన పాటను అనుష్కపై చిత్రీకరించామని, వంద మంది డాన్సర్లు, వేయి మంది జూనియర్ ఆర్టిస్టులో అత్యంత భారీగా కాకతీయ వైభవాన్ని చాటిచెప్పే విధంగా పది రోజుల పాటు చిత్రీకరించడం జరిగిందన్నారు. ఇదే సెట్లో రాత్రి వేళల్లో రుద్రమదేవి పట్టాభిషేకం సందర్భంగా వచ్చే మరో పాటను కూడా తెరకెక్కించడం జరిగిందన్నారు.

    దీంతో పాటు ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో రెండు భారీ పోరాట సన్నివేశాలు కూడా చిత్రీకరించామని, వీటిలో పాల్గొన్న అనుష్క ఎలాంటి డూప్ లేకుండా చేసిందని తెలిపారు. రుద్రమదేవి చిత్ర కథానాయుడైన రాణాతో పాటు, మహామంత్రి శివదేవయ్య పాత్రలో ప్రకాష్ రాజ్, గణపతిదేవుడగా కృష్ణం రాజు, అంబదేవుడుగా జయప్రకాష్ రెడ్డి, హరిహర దేవుడుగా సుమన్, మురారిదేవుడుగా ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్యగా అజయ్‌లతో పాటు విజయ్ కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, జారాషా, నథాలియాకౌర్, అతిథి చెంగప్ప, ప్రభ, సన, రక్ష తదితరులు ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొన్నారని తెలిపారు.

    ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో వేయిస్థంబాల గుడి, రంగమండపం సెట్స్ నిర్మాణం జరుగుతుంది. రెండో షెడ్యూల్ ఈ సెట్ లో జరుగుతుంది. డిసెంబర్ వరకు జరిగే ఐదు షెడ్యూల్స్‌లో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Rudramma Devi : A massive temple set is being created in Annapurna 7 acres studio. Two songs and some key scenes will be shot during this schedule. More than 1000 junior artists will be taking part in the shoot. Anushka and Rana Daggubatti play lead roles and Krishnam Raju will be seen in a pivotal role. Rudramma Devi is produced and directed by Gunsekhar and is set for early 2014 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X