తెలుగు బాక్సాఫీస్ జోరు.. ఈ శుక్రవారం పది సినిమాలు.. ఏమేంటో తెలుసా?
మామూలుగా అయితే సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఫిబ్రవరి నెలలో పెద్దగా సినిమాలు విడుదల అయ్యేవి కావు. ఎందుకంటే మార్చి ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరి నుంచి చదువుల వ్యవహారం మీద దృష్టి పెడుతూ ఉంటారు స్కూలు, కాలేజీ పిల్లలు అలాగే వారి వారి వారి తల్లిదండ్రులు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు అన్ని పరిస్థితులూ మారిపోవడంతో ఫిబ్రవరి నెలలో ఏకంగా పది సినిమాల విడుదలకు సిద్ధం కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు

సన్ ఆఫ్ ఇండియా
అయితే పేరుకు పది సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ అందులో గట్టిగా చెప్పుకోదగ్గ సినిమాలు రెండు మాత్రమే అని చెప్పాలి. అందులో మొదటి పేరు మాత్రం మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వర్జీన్ స్టోరీ
అలాగే విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం వర్జీన్ స్టోరీ. సౌమిక పాండియన్ రిషీ ఖన్నా వినీత్ బవిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతోంది.

సాత్విక్ వర్మ హీరోగా
కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక పైన పేర్కొన్న రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ చిన్న చిత్రాలే. గత వారం విడుదల కావాల్సిన 'బ్యాచ్ 'ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 'బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య'వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్ వర్మ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు.

అన్నీ కలిపి
అలానే అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక నటించిన సినిమా "సురభి 70 ఎం ఎం (హిట్టు బొమ్మ)" కూడా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కాకుండా రోమన్, విశ్వక్, 2020 గోల్ మాల్, నీకు నాకు పెళ్ళంట' సినిమాలు వీకెండ్ లో విడుదల కానున్నాయి. వీటితో పాటు ఆంగ్ల అనువాద చిత్రం 'అన్ చార్టెడ్', కన్నడ డబ్బింగ్ సినిమా 'బడవ రాస్కెల్' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ పది సినిమాలలో ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











