చిరంజీవితో టెన్షన్ లేదు...రామ్ చరణ్ అనేసరికే: నాగబాబు
తను తన అన్న చిరంజీవితో చిత్రాలు నిర్మించినప్పుడు టెన్షన్ పడలేదని, ఇప్పుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రం చేస్తున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పలు జాగ్రత్తలతో చేయాల్సి వస్తోందని చెప్తున్నారు. ఆయన ఆరెంజ్ గురించి మాట్లాడుతూ...నేను మా అన్నయ్యతో గతంలో చిత్రాలు నిర్మించాను. అయితే మా అన్నయ్యతో ఉన్న అనుబంధం వేరు. ఇద్దరం సోదరుల్లా కాకుండా ప్రెండ్స్ లా మెలిగేవాళ్ళం. చాలా సరగాగా నిర్మాతగా గడిచిపోయింది. అదే రామ్ చరణ్ దగ్గరకొచ్చేసరకి అతను నాకు కొడుకుతో సమానం. అంటే నా భాధ్యతలు రెట్టింపు అయ్యాయి. చిరంజీవితో చేసేటప్పుడు ఏమన్నా తప్పులు దొర్లచ్చేమో గాని ఇప్పుడలా జరగకుండా అన్ని జాగ్రత్తలుతీసుకోవాల్సి వస్తోంది. అయితే ఆరెంజ్ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా మిగిలిపోతుంది అన్నారు. అలాగే ఈ చిత్రం ఖుషీ తరహాలో హాయిగా, రొమాంటిగ్గా సాగే సినిమా ఇది. చరణ్ కి, భాస్కర్ కి ఇది మూడో చిత్రం. కచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అని నాగబాబు చెప్పారు. రామ్ చరణ్ తేజ్, జెనీలియా కాంబినేషన్ లో భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











