లండన్ లో రొమాంటిక్ ప్రేమజంట షికారు...

By Sindhu

బాలీవుడ్‌ లోప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కొంత కాలం క్రితం కరీనా కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన షాహీద్‌ కపూర్ ఆతర్వాత ప్రియాంకా చోప్రాతో ప్రేమాయణం సాగిస్తున్నాడని బాలీవుడ్‌ లో గుసగుసలు వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లండన్ వీధుల్లో షికారు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారమ్.

'కమీనే" చిత్రంలో జోడీగా నటించిన ఈ జంట ప్రస్తుతం కునాల్ కోహ్లీ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తేరీ మేరీ కహానీ"లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. ఓ పక్క షూటింగ్ జరుగుతుంటే మరో పక్క షూటింగ్ గ్యాప్‌లో షాహీద్‌కపూర్, ప్రియాంకా చోప్రా లండన్ వీధుల్లో షికారు చేస్తున్నారట. పైగా ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది కాబట్టే వీరిపై చిత్రీకరిస్తున్న సన్నివేశాల్లో వీరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోందని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. 60 దశకం కాలం నాటి కథ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు చాలా కొత్తగా వుంటాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X