రోడ్డెక్కి జనంపై దాడి చేస్తున్న రానా... (ఫోటో)
హైదరాబాద్: ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే...ఒక్కసారిగా జనాలు షాకవ్వడం ఖాయం. ఏంటీ రానా భల్లలదేవ గెటప్ లో రొడ్డెక్కి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇలా గదతో దాడి చేస్తున్నారనుకుంటున్నారా? అదేం లేదండీ. ఇది మార్ఫింగ్ ఫోటో. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించే వారిని మేలుకొలిపేందుకే ఇలా ప్లాన్ చేసారు. ఈ ఫోటో చూసిన రానా గ్రేట్ ఐడియా అంటూ... తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో ఈ ఫోటో పోస్టు చేసాడు.
బాహుబలి సినిమా విషయానికొస్తే...రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలై ట్రైలర్ ‘బాహుబలి' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగేలా చేసాయి. ఆడియో వేడుక కనీ విని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా జరిగింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాపై యావత్ భారతీయ సినీ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

హిందీలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. కరణ్ జోహార్ కోరిక మేరకు ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు. ప్రస్తుతం అక్కడ సినిమా ప్రచారం నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడానికి విదేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











