టెర్రిఫిక్ లుక్ అంటే ఇదే...(ఫొటోలు)
ముంబై : తన కొత్త చిత్రం షమితాబ్ ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు. ఈ లుక్ చూసిన వారంతా టెర్రిఫిక్ గా ఉందని ముక్త కంఠంతో అంటున్నారు. ఈ సినిమాలో అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు, గెడ్డంతో అమితాబ్ (71) చాలా విభిన్నంగా కనిపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ల కంటపడకుండా ఈ సినిమా గెటప్ ను ఎక్కువ కాలం దాచి ఉంచడం చాలా కష్టమని, అందుకే తాను విడుదల చేసేస్తున్నానని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్ ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. తన కొత్త చిత్రం షమితాబ్ కోసం ఆయన ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ గీతాన్ని అమితాబ్ ముంబాయిలోని ఆదేష్ స్టూడియోలో ఆలపించినట్లు సమాచారం. దీనిని గురించి సామాజిక అనుసంధాన వేదిక అయిన ట్విట్టర్‌లో అమితాబ్ సందేశాన్నిచ్చారు.

చాలా ఏళ్లు గడిచినా ఇళయరాజా గారి స్వరాలలో మాధుర్యం మాత్రం అలాగే వుంది. ఆయన సంగీతాన్ని సమకూరుస్తున్న చిత్రంలో మరోసారి పాట పాడే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను అని అమితాబ్ తెలిపారు. గతంలో ఇళయరాజా స్వరాలను అందించిన చీనికమ్ పా చిత్రాల్లోను అమితాబ్ తన గొంతును వినిపించారు.
షమితాబ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు తమిళ నటుడు ధనుష్, కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. గోవా, తమిళనాడులలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











