»   » హీరోయిన్ శ్రద్ధ కపూర్‌కు ఆ ఉగ్రవాది వీరాభిమాని (ఇవే సాక్ష్యం)

హీరోయిన్ శ్రద్ధ కపూర్‌కు ఆ ఉగ్రవాది వీరాభిమాని (ఇవే సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల ఉగ్రవాదులు దాడికి పాల్పడి దాదాపు 20 మంది విదేశీయులను, పోలీసులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉగ్రమూకలోని ఒకడు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు అభిమాని అని తేలడంతో ఇపుడు ఈ విషయం నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఆ ఉగ్రవాది పేరు నిబ్రాస్ ఇస్లాం.... వీడు బాగా చదుకున్న వ్యక్తి మాత్రమే కాదు, సంపన్నమైన ఫ్యామిలీకి చెందిన వాడు కూడా. గతంలో ఓ కార్యక్రమంలో శ్రద్ధా కపూర్‌ను కలిసాడని, ఆమె అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడని అతని ఫేస్ బుక్ పోస్టుల ద్వారా తెలుస్తోంది.

మతోన్మాద ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన 20 సంవత్సరాల వయసున్న నిబ్రాస్ ఇస్లాం...ఉగ్రవాద శిక్షణ అనంతరం ఇటీవల ఢాకాలో జరిగిన దాడిలో పాలు పంచుకున్నాడు. ఉగ్రవాదులను హత మార్చేందుకు వెంటనే ఆపరేషన్ చేపట్టిన సైన్యం ఆరుగురు ఉగ్రవాదులను హతమాచ్చింది. వీరిలో నిబ్రాస్ ఇస్లాం ఉన్నాడు.

స్లైడ్ షోలో శ్రద్ధా కపూర్ గురించి నిబ్రాస్ ఇస్లా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్, మరిన్ని వివరాలు...

శ్రద్ధా కపూర్ గురించి..

శ్రద్ధా కపూర్ గురించి..

శ్రద్దా కపూర్ బ్యూటీగా పేర్కొంటూ....ఆమె నుండి షేక్ హ్యాండ్ తీసుకున్న అనంతరం నిబ్రాస్ ఇస్లాం ఫీలింగ్ పెర్ఫెక్ట్ అంటూ పెట్టిన పోస్ట్

నిబ్రాస్ ఇస్లాం

నిబ్రాస్ ఇస్లాం

సైన్యం కాల్పుల్లో హతమైన ఉగ్రవాది నిబ్రాస్ ఇస్లాం ఇతడే...

రిచ్ ఫ్యామిలీ, మంచి స్కూల్ లో..

రిచ్ ఫ్యామిలీ, మంచి స్కూల్ లో..

నిబ్రాస్ ధనవంతులైన ఫ్యామిలీకి చెందిన, మంచి స్కూల్ లో చదువుకున్నాడు. అయితే అతడు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉగ్రవాదిగా మారాడు.

వీడియో..

నిబ్రాస్ ఇస్లాంకు సంబంధించిన వీడియో...

English summary
Terrorist Nibras was a Shraddha Kapoor fan. “Shraddha Kapoor, you beauty,” reads the exuberant caption, followed by “the moment when she held my hand…” The Facebook post — a video clip of actress Shraddha Kapoor meeting and greeting a crowd of fans — would have read like any Bollywood enthusiast’s. The post marks the user’s status “feeling perfect”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu