హైదరాబాద్ కాలేజీలో సోనాక్షి, అర్జున్ కపూర్ సందడి (ఫోటోస్)
హైదరాబాద్: అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా సోమవారం ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సందడి చేసారు. వీరి తాజా సినిమా తేవార్ ప్రమోషన్లో భాగంగా విద్యార్థులతో కలిసి ఆడి పాడి సందడి చేసారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.
2003లో మహేష్ బాబు, బూమిక చావ్లా జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ చిత్రం ‘ఒక్కడు' ఘన విజయం సాధించింది. ఇపుడు అదే చిత్రాన్ని హిందీలో అమిత్ శర్మ దర్శకత్వంలో, సంజయ్ కపూర్ పునర్నిర్మించారు. ఒక్కడు చిత్రాన్ని 2004లో తమిళంలో కూడా పునర్నిర్మించారు. విజయ్-త్రిష హీరో హీరోయిన్లుగా ‘గిల్లి' పేరుతో తెరకెక్కించారు.

తేవార్
ఈ ‘తేవార్' చిత్రంలో అర్జున్ కపూర్ పింటు పాత్రలో, సోనాక్షి సిన్హా రాధిక పాత్రలో, మనోజ్ భాజ్ పేయి విలన్ పాత్రలో గజేందర్ సింగ్‌గా, ఖాదిర్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా, హిమాన్షు సింగ్ రోహన్ గా నటిస్తున్నారు.

అర్జున్ కపూర్
ఈ చిత్రంలో అర్జున్ కపూర్ ఆగ్రాలోని ఒక సాధారణ కళాశాల విద్యార్థిగా, కబడ్డీ చాంపియన్‌గా ప్రధాన పాత్ర పోషించారు.

అమిత్ శర్మ
అమిత్ శర్మ ఈ చిత్రం ద్వారా తన దర్శకత్వ అరంగ్రేటం చేసారు.

షూటింగ్
ఈ చిత్రాన్ని జైపూర్ లోని సాంబార్ సరస్సు, రాజస్థాన్, ముంబై, మహేశ్వర్, ఆగ్రా, మధుర, పండర్ పూర్, చాంద్రభాగా నది ఒడ్డున, హరిదాస్ సహా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు.

విడుదల
తేవార్ చిత్రం జనవరి 9, 2015న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











