TFI Fans Cricket League: నాగార్జున ఫ్యాన్స్ జట్టుపై మహేష్ టీమ్ విజయం.. సెంచరీ చేసినా ఫలితం దక్కని..!
తెలుగు సినిమా పరిశ్రమలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నది. ఇండస్ట్రీలో టాప్ హీరోల ఫ్యాన్స్ తమ తమ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ నువ్వా? నేనా అనే విధంగా కొనసాగుతున్నది. అయితే జనవరి 30వ తేదీన జరిగిన పోటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున అక్కినేని ఫ్యాన్స్ మధ్య జరిగిన పోటీల గురించిన వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నాగ్ కింగ్స్ (Nag Kings)తో మహేష్ బాబుకు ఫ్యాన్స్‌కు చెందిన గ్లోబ్ ట్రాటెర్స్ (Global Trotters) జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గ్లోబ్ ట్రాటర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. దాంతో నాగ్ కింగ్స్ జట్టు బౌలింగ్ చేపట్టింది.

గ్లోబ్ ట్రాటెర్స్ జట్టులో దీక్షిత్ రెడ్డి 28 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 81 పరుగులు సాధించాడు. జుబేయిర్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 1 ఫోర్‌తో 81 పరుగులు చేశాడు. దాంతో 19.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. కింగ్ నాగ్ జట్టులో నాగేశ్ 3 వికెట్లు, రాజేశ్ కుమార్ 1 వికెట్లు, వినియ్ 1 వికెట్లు పడగొట్టారు. సయ్యద్ 1 వికెట్, జిమ్మి 2 వికెట్లు, చైతన్య 2 వికెట్లు సొంతం చేసుకొన్నారు.
233 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నాగ్ కింగ్ జట్టు..ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాషిన్ ధార్ అద్బుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కేవలం 62 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 105 పరుగులు సాధించాడు. అలాగే విజయపథం వైపు పరుగు పెడుతున్నట్టే కనిపించింది. అయితే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 మాత్రమే చేసింది. దాంతో 40 పరుగుల తేడాతో మహేష్ బాబు ఫ్యాన్స్ జట్టు విజయం సాధించింది.
గ్లోబల్ ట్రాటెర్స్ జట్టులో రాజ్ 2 వికెట్లు, ఖాసీం 2 వికెట్లు, జుబేర్ 1వ వికెట్ సాధించాడు. ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకొన్న రాజ్ ధార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications











