నాగచైతన్య-సునీల్ ‘తడాఖా’ ఆడియో వేడుక చీఫ్‌గెస్ట్‌గా వెంకటేష్?

By Bojja Kumar

హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకుడు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ హాజరవుతున్నట్లు సమచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. నాగ చైతన్య వెంకటేష్‌కు మేనల్లుడవుతాడనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు సమాచారం.

తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో 'వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్‌గా 'తడాఖా' చిత్రం డాలి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్‌ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్‌, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్‌, పాటలు: చంద్రబోస్‌, సంగీతం: తమన్‌, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X