‘తడాఖా’ ఆడియో సాంగ్స్ లిస్ట్
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకుడు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సాంగ్స్ లిస్ట్ విడుదల చేసారు. ఇందులో ఏమేం పాటలు ఉన్నాయో ఓ లుక్కేయండి
1. నువ్వు నేను బొమ్మ
గానం : టిప్పు, రజని
రచన : భాస్కరభట్ల రవికుమార్
2. వియ్యాల వారు
గానం : నీటి మోహన్, నీరజ్, ఎంఎం మానసి
రచన : రామజోగయ్య శాస్త్రి
3. సుభానల్లాహ్
గానం : కార్తీక్, ప్రియా హేమేష్
రచన : రామ జోగయ్య శాస్త్రి
4. మారా ఓ మారా
గానం : సుచిత్ సురేశన్, ఎంఎం మానసి
రచన : రామ జోగయ్య శాస్త్రి
5. గణ గణ బొట్టు
గానం : హరి చరణ్, ప్రియ దర్శిని
రచన : రామజోగయ్య శాస్త్రి
ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ హీజరవుతున్నట్లు సమచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. నాగ చైతన్య వెంకటేష్‌కు మేనల్లుడవుతాడనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు సమాచారం.
తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో 'వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్‌గా 'తడాఖా' చిత్రం డాలి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).


Click it and Unblock the Notifications











