‘తడాఖా’ హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా కథానాయికలుగా నటించారు.
మే 10న ఈ చిత్రం విడుదవుతోంది. ఈ మేరకు హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్ కూడా విడుదలైంది. అందుకు సంబంధించిన వివరాలను స్లైడ్ షోలో వీక్షించండి. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.
సినిమాలో నాగచైతన్య సరికొత్తగా, యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. అదే విధంగా సునీల్ కామెడీ, యాక్షన్ సినిమాకు అదనపు ఆకర్షణ. హీరోయిన్లు తమన్నా, ఆండ్రియాలు తమ శక్తి మేర ప్రేక్షకుల అందాల విందు చేయనున్నారు. హిట్ సినిమాకు రీమేక్ కావడంతో మంచి ఫలితాలు వస్తాయని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.
ఇక సినిమా కాన్సెప్టులోకి వెళితే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నాగచైతన్య అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ ఇతర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).

తడాఖా మూవీలో నాగ చైతన్య, సునీల్

హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్

హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్

హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్

తడాఖాలో తమన్నా, నాగ చైతన్య


Click it and Unblock the Notifications











