twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తడాఖా, సుకుమారుడు యూఎస్ఏ వీకెండ్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నాగచైతన్య, సునీల్ కాంబినేషన్లో రూపొందిన 'తడాఖా', ఆది-నిషా అగర్వాల్ జంటగా రూపొందిన 'సుకుమారుడు' చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడీ విత్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన తడాఖా చిత్రానికి కిషోర్ కుమార్ పార్ధాసాని(డాలీ) దర్శకత్వం వహించారు. తమిళంలో హిట్టయిన వెట్టై చిత్రానికి ఇది రీమేక్. రొమాంటిక్ కామెడీ విత్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన 'సుకుమారుడు' చిత్రానికి జి అశోక్ దర్శకత్వం వహించారు.

    ఈ రెండు చిత్రాల బాక్సాఫీసు వద్ద అంతంత మాత్రంగా రెస్పాన్స్ వచ్చింది. యూఎస్ఏలో ఈ చిత్రాల పరిస్థితిని పరిశీలిస్తే....తడాఖా చిత్రం యూఎస్ఏలో 35 స్క్రీన్లలో విడుదలై ఓపెనింగ్ వీకెండ్ నాటికి $60,975 (రూ. 33.40 లక్షలు) వసూలు చేసింది. సుకుమారుడు చిత్రం 17 స్ర్కీన్లలో విడుదలై కేవలం $1,638 (రూ. 89,735) మాత్రవే వసూలు చేసింది.

    ఇంతకు ముందు విడుదలైన జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రం 110 స్క్రీన్లలో విడుదలై రూ. 6.03కోట్లు వసూలు చేసింది. అయితే యూఎస్ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు అత్యధికంగా వసూలు చేసిన రికార్డు మాత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' పేరు మీదనే ఉంది. ఈ చిత్రం 69 స్క్రీన్లలో విడుదలై కేవలం 4 రోజుల్లో రూ. 6.87 కోట్లు($12,62,100) రాబట్టింది. మరి భవిష్యత్ లో ఈ సినిమా రికార్డును బద్దలు కొట్టే మూవీ ఏదో చూడాలి.

    English summary
    Thadaka which released in 35 screens across USA collected $60,975 [Rs. 33.40 lacs] in the opening weekend. Sukumarudu, on the other hand was releases in 17 screens and made $1,638 [Rs. 89,735] over the weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X