Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంపాదన పెరిగింది: కొత్త కారు కొన్న తాగుబోతు రమేష్
హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రంతో తాగుబోతు పాత్రలో అందరినీ మెప్పించిన రమేష్....ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరిసలపనంత బిజీ అయిపోయాడు. తన కామెడీకి డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసాడు.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం రోజుల లెక్కన లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదే తరహాలో తాగు రమేష్ కూడా రోజుల లెక్కన రెమ్యూనరేషణ్ వసూలు చేస్తున్నాడట. అతగాడి రెమ్యూనరేషన్ రోజుకు రూ. లక్ష అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
సోషల్ నెట్వర్కింగులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తాగుబోతు రమేష్ అభిమానులతో ఎప్పుడూ తనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆ మధ్య ఫ్లాట్ కొనుగోలు చేసిన రమేష్...తాజాగా ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ హై ఎండ్ కారు కొనుగోలు చేసాడు. దీని ధర దాదాపు రూ. 10 లక్షలు. కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఫోటో పోస్టు చేసారు.
తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.
రమేష్‌ది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడు. ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి చూసిన రమేష్.......తాగుబోతులను ఇమిటేట్ చేయడం ప్రాక్టీస్ చేసే వాడు. నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు.