twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత చిత్రంలో తాగుబోతు రమేష్ కీ రోల్

    By Srikanya
    |

    హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రం క్లైమాక్స్ లో వచ్చి హంగామా చేసి నవ్వించిన హాస్య నటుడు తాగుబోతు రమేష్. దాదాపు ఆ సినిమాను నిలబెట్టిన క్యారెక్టర్ గా తాగుబోతు రమేష్ కు పేరు వచ్చింది. అంతేగాక రీసెంట్ గా రాజమౌళి ఈగ లోనూ కనపడింది ఒకే సీన్ లో అయినా నవ్వించాడు. తాజాగా సమంత, సిద్దార్ద కాంబినేషన్ లో నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ ఫుల్ లెంగ్త్ రోల్ ని పోషించబోతున్నట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయి లో జరుగుతోంది. అక్కడ ఒక పాట,టాకీ పార్టు కొంత తీస్తారు.

    హీరో సిద్దార్ద మాట్లాడుతూ...'నందిని దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆమె చెప్పిన కథ నచ్చింది. కచ్చితంగా ఓ మంచి చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది. అలాగే లేడీ డెరైక్టర్‌తో సినిమా చేయడం నాకిదే మొదటిసారి. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ''ఇదొక సెన్సిటివ్ లవ్‌స్టోరి. తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం అవుతుంది. బెల్లంకొండ అభిరుచికి తగ్గ కథ ఇది. నందినీరెడ్డిని లేడీ మణిరత్నం అనొచ్చు'' అని ప్రముఖ రచయిత కోన వెంకట్ అన్నారు.

    దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ...'అలా మొదలైంది' చిత్రానికి నాని, నిత్యమీనన్‌లని నాయకానాయికలుగా తీసుకోవడంతోనే సగం విజయం సాధించాను. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, సమంత కలిసి నటిస్తుండటంతో 70 శాతం విజయం దక్కినట్టే. అందరూ మెచ్చే సినిమా అవుతుందని ధీమాగా చెప్పగలను అంది. ఇక హీరోయిన్ సమంత మాట్లాడుతూ...''సిద్ధార్ధ్ మంచి నటుడు. అందుకే తనంటే నాకు గౌరవం. 'అలా మొదలైంది' చాలాసార్లు చూశాను. నందినీరెడ్డితో సినిమా చేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరుతున్నందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పింది.

    ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, సంగీతం: తమన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్: బి.మహేంద్రబాబు. బెల్లకొండ సురేష్ ఈ చిత్రాన్ని సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో 'అలా మొదలైంది' సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నందినీరెడ్డి దర్శకత్వంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

    English summary
    Now Thagubothu Ramesh will soon be seen in a crucial full length role in director Nandini Reddy’s new movie that has Siddharth and Samantha in the lead roles. Shooting of the film has been going on at a good pace and the unit will be heading to Dubai soon to shoot a song and some talkie scenes. The movie is gearing up for a possible end of year release. Music is being composed by S.S.Thaman and Bellamkonda Suresh is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X