దాడి : పవన్ కళ్యాణ్‍‌కి ‘తాగుబోతు’ రమేష్ థాంక్స్

By Bojja Kumar

హైదరాబాద్: ‘బజర్దస్త్' వేణుపై ఇటీవల గౌడ సంఘాల నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ షోలో తమ మనోభావాలు దెబ్బతీసేలా స్కిట్ చేసారంటూ గౌడ సంఘాల నేతలు వేణుపై దాడి చేసారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు ఆరోపించాస్తున్నారు.

వేణుకు సినీ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వేణుకు మద్దతు పలుకాడని, వేణును స్వయంగా వచ్చి పరామర్శించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కమెడియన్ తాగుబోతు రమేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ అంటూ కామెంట్ చేసారు.

Thagubothu Ramesh says thanks Pawan Kalyan

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక తాగుబోతు రమేష్ గురించిన సినిమాల వివరాల్లోకి వెళితే....

తాగుబోతు రమేష్ హీరోగా సినిమా ప్రారంభమైంది. సోలో హీరోగా తాగుబోతు రమేష్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. కాంతరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాగుబోతు రమేష్ సరసన మేఘన పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు-కన్నడ రెండు బాషల్లో విడుదల అవుతుందని తాగుబోతు రమేష్ వెల్లడించారు.

అలా మొదలైంది' చిత్రంతో తాగుబోతు పాత్రలో అందరినీ మెప్పించిన రమేష్....ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరిసలపనంత బిజీ అయిపోయాడు. తన కామెడీకి డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X