తాగుబోతు రమేష్ హీరోగా తెలుగు-కన్నడ సినిమా....
హైదరాబాద్: తాగుబోతు రమేష్ హీరోగా సినిమా ప్రారంభమైంది. సోలో హీరోగా తాగుబోతు రమేష్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. కాంతరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాగుబోతు రమేష్ సరసన మేఘన పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు-కన్నడ రెండు బాషల్లో విడుదల అవుతుందని తాగుబోతు రమేష్ వెల్లడించారు.
అలా మొదలైంది' చిత్రంతో తాగుబోతు పాత్రలో అందరినీ మెప్పించిన రమేష్....ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరిసలపనంత బిజీ అయిపోయాడు. తన కామెడీకి డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసాడు.

తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.
రమేష్‌ది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడు. ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి చూసిన రమేష్.......తాగుబోతులను ఇమిటేట్ చేయడం ప్రాక్టీస్ చేసే వాడు. నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











