సాహో సెట్‌లో ప్రభాస్‌కు సర్‌ప్రైజ్.. ఇద్దరూ కలసి రెండుగంటల పాటు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆగష్టు 15న విడుదల అని ప్రకటించారు. దీనితో అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు సుజిత్ వేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. సాహో సెట్స్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ప్రభాస్‌కు సర్‌ప్రైజ్
తమిళ స్టార్ హీరో తలా అజిత్ సాహో సెట్స్ ని సందర్శించాడు. అజిత్ రాకని ఎవరూ ఊహించలేదు. దీనితో ప్రభాస్ కూడా షాక్ అయ్యాడట. అజిత్ రాగానే అతడిని ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలసి సెట్స్ లోనే రెండగంటలకు పైగా సరదాగా ముచ్చటించుకున్నారట. తమిళనాట రోజురోజుకు క్రేజ్ పెంచుకుంటూ తిరుగులేని హీరోగా అజిత్ మారాడు. ఇక ప్రభాస్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

బిల్లాతో క్రేజ్
తమిళంలో బిల్లా చిత్రంలో అజిత్ నటించాడు. తెలుగులో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇద్దరి హీరోలకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇక ప్రభాస్ అజిత్ లుక్ చూసి షాక్ అయ్యాడట. అజిత్ ప్రస్తుతం బోనికపూర్ నిర్మాణంలో పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతోంది.

అజిత్, ప్రభాస్ ఇద్దరూ
అజిత్, ప్రభాస్ ఇద్దరూ సెల్ఫీలకు, పర్సనల్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభాస్ లుక్ బయటకు రాకూడదని సాహో చిత్రయూనిట్ ఆ ఫోటోలని విడుదల చేయలేదు. ఇద్దరూ ఇంటికి వెళ్లే ముందు వరకు సెట్స్ లోనే గడిపారట. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సాహో చిత్ర షెడ్యూల్ మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఇక అజిత్ నటిస్తున్న పింక రీమేక్ లో విద్యాబాలన్, శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు.

మరక్కార్ సెట్స్‌లో
సాహో సెట్స్ లో ప్రభాస్ ని కలసిన అనంతరం అజిత్ మరక్కార్ చిత్ర సెట్స్ ని కూడా సందర్శించారు. మరక్కార్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్, సునీల్ శెట్టి, అర్జున్ సార్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











