‘బాద్ షా’ రీమేక్ రూమర్స్, స్టార్ హీరో ఖండన
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో హీరో విజయ్ గతంలో అనేక తెలుగు సినిమాల రీమేక్‌లలో నటించారు. ఆయన కెరీర్లో వచ్చిన హిట్ సినిమాల్లో ఇతర భాషల నుంచి చేసిన, ముఖ్యంగా తెలుగు నుంచి చేసిన రీమేకులే ఎక్కువ. తెలుగు సినిమా పవర్ ఏ రేంజిలో ఉంటుందో ఇప్పటికే రుచి చూసిన విజయ్.....తెలుగులో తాజాగా విడులైన బ్లాక్ బస్టర్ హిట్టయిన 'బాద్ షా' రీమేక్‌పై కన్నేసారని వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలను విజయ్ ఖండించారు. ప్రస్తుతం అతను తలైవా అనే తమిళ చిత్రం షూటింగులో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్నారు. తను 'బాద్‌షా' చిత్రం రీమేక్‌లో నటిస్తున్నానని వార్తలు రావడంతో అవాక్కయ్యారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రతిపాదనతో నన్నెవరూ సంప్రదించలేదని, నేను 'బాద్‌షా' తమిళ రీమేక్‌లో నటిస్తున్నట్లు వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు.
కాగా...తమిళ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 'బాద్ షా' తమిళ రీమేక్ హక్కులను పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి పొట్లూరి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తమిళ్‍లో టాప్ హీరోతో ఈచిత్రాన్ని చేయడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈలోగానే....విజయ్ ఇందులో హీరో అంటూ పుకార్లు మొదలయ్యాయి. అదన్నమాట సంగతి.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

విజయ్ ఇప్పటి వరకు అనే రీమేక్ సినిమాల్లో నటించారు. శంకర్ దర్శకత్వంలో హిందీలో హిట్టయిన 3 ఇడియట్స్ చిత్రాన్ని తమిళంలో ‘నంబన్' పేరుతో రీమేక్ చేసారు.

తెలుగులో నాగార్జున నటించిన ‘ఆజాద్' చిత్రాన్ని విజయ్ తమిళంలో ‘వేలాయుధం' పేరుతో చేసారు.

మళయాళం, హిందీ, తెలుగు వెర్షన్లలో రూపొందిన హిట్ మూవీ బాడీగార్డ్ తమిళ రీమేక్ విజయ్ హీరోగా ‘కావలన్' పేరుతో రూపొందింది.

హిందీలో హిట్టయిన సోల్జర్ చిత్రాన్ని విజయ్ తమిళంలో ‘విల్లు' పేరుతో చేసారు.

తెలుగులో భారీ విజయం సాధించిన మహేష్ బాబు ‘పోకిరి' చిత్రం...తమిళంలో విజయ్ హీరోగా ‘పోక్కిరి' పేరుతో రూపొందించారు.


Click it and Unblock the Notifications











