విజయ్‌కు తారక్ ఫోన్.. నిర్మాత మహేశ్ ప్రకటన.. ఇప్పటికైనా వాళ్ల మధ్య గొడవ ఆగుతుందా.!

By Manoj

ఇళయదళపతి విజయ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీళ్లిద్దరూ దక్షిణ భారతదేశంలోనే తమ తమ పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నారు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నింటిలోనూ సమానమైన స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇదే క్రమంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని ఒకటి బయటకు వచ్చింది. దీనిని ప్రముఖ నిర్మాత ప్రకటించారు. ఇంతకీ తారక్ ఏం చేశాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

విజయ్‌ను కలిసిన తెలుగు నిర్మాత

విజయ్‌ను కలిసిన తెలుగు నిర్మాత

ఇళయదళపతి విజయ్‌ ఇటీవల ‘విజిల్' (తమిళంలో బిగిల్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత మహేశ్ కోనేరు తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఆయన హీరో విజయ్‌ను కలిశారు.

ఈ సారి డైరెక్టుగా వస్తానన్నారు

విజయ్‌తో జరిగిన సమావేశం గురించి మహేశ్ కోనేరు సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘విజయ్ సార్‌ను కలిశాను. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సింపుల్‌గా ఉన్నారు. అంతేకాదు, ‘విజిల్'ను తెలుగులో ప్రమోట్ చేసిన విధానం ఆయనకు నచ్చింది. ఈ విషయంలో నన్ను మెచ్చుకున్నారు. తర్వాతి సినిమాకు తెలుగు ప్రేక్షకులను కలుస్తానని హామీ ఇచ్చారు' అని వెల్లడించారు.

తారక్ సార్‌తో మాట్లాడారు

తారక్ సార్‌తో మాట్లాడారు

ఇదే ట్వీట్‌లో మహేశ్ కోనేరు ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. ‘విజయ్ సార్‌ను కలిసిన సమయంలో ఓ సంతోషకరమైన సంఘటన జరిగింది. ఆయనతో జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరూ ఒకరిని ఒకరు అభినందించుకున్నారు' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.

హీరోల అభిమానుల మధ్య వార్

హీరోల అభిమానుల మధ్య వార్

రెండు పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ చేయడంలో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ విషయంలో ఈ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడది చిలికి చిలికి గాలి వానలా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
హీరోల సంభాషణతో బ్రేక్ పడేనా

హీరోల సంభాషణతో బ్రేక్ పడేనా

ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మహేశ్ కోనేరు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. విజయ్ - జూనియర్ ఎన్టీఆర్‌లో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారనే వార్త బయటకు రావడంతో ఈ గొడవకు బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X