విజయ్, సూర్య, మోహన్‌లాల్, మమ్ముట్టి, కీర్తి సురేష్‌కు విషాదం.. కన్నీటిపర్యంతమవుతున్న స్టార్స్
ఒక్కరి మరణం ఎందరి హీరోలకే విషాదంగా మారింది. మామూలుగా స్టార్ హీరోలకు అతి దగ్గరగా, వారికి కంటికి రెప్పలా కాపాడుకునేది వారి అంగరక్షకులే. ప్రైవేట్ ఫంక్షన్లకు హాజరైనా, సినీ వేడుకల్లో సందడి చేసిన వారికి తోడుగా ఉండేది ఈ బాడీ గార్డ్సే. స్టార్ హీరోలు బయట కనబడితే ఎంతటి కోలాహలంగా ఉంటుందో ఎంత రద్దీ పెరుగుతుందో అందరికీ తెలిసిందే. కొన్ని వందలమంది చుట్టుముట్టినా హీరోలను సురక్షితంగా చూసుకుంటారు. అందుకే సెలెబ్రిటీలకు బాడీ గార్డ్స్ అంటే ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తారు.

స్టార్స్ బాడీగార్డ్..
తమిళ, మలయాళ స్టార్ హీరోల వద్ద బాడీగార్డుగా పని చేశాడ దాస్ చేట్టా. దళపతి విజయ్, మోహన్ లాల్, సూర్య, మమ్ముట్టి వద్ద పనిచేశాడు. అయితే ఈయన అకాల మరణం పట్ల ఈ హీరోలంతా విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

అనారోగ్యంతో మృతి..
దాస్ చేట్టా(47)కు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. జాండీస్ కారణంగా నిన్న (జూన్ 12) సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణ వార్త విన్న సెలెబ్రిటీలు కన్నీటి పర్యంతం అయ్యారు.
Recommended Video
కీర్తీ సురేష్ ఎమోషనల్..
బాడీ గార్డ్ దాస్ చెట్టా మృతిపై కీర్తి సురేష్ ఎమోషనల్ అయింది. నువ్వెంటో తెలిసిన ప్రతీ ఒక్కరికీ ఎల్లప్పుడూ గుర్తుంటావ్ అని కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఇదే క్రమంలో హీరోలు సైతం స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రగాఢ సానుభూతి..
మళయాల హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దాస్ చేట్టా మరణ వార్తపై స్పందించాడు. ‘మిమ్మల్ని మిస్ అవుతున్నాము.. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని సోషల్ మీడియా వేదికగా కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











