సినీ ఇండస్ట్రీలోకి మరో వారసుడు. సూపర్‌స్టార్ కుమారుడి గ్రాండ్ ఎంట్రీ!
దక్షిణాది సినీ పరిశ్రమలోకి మరో వారసుడు అడుగుపెట్టబోతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఇళయ దళపతి విజయ్‌కు కుమారుడు జాసన్ సంజయ్ త్వరలోనే హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నారు. కెనడాలో యాక్టింగ్‌లో శిక్షణ పొందుతన్న జాసన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో జోరందుకొంటున్నాయి. అయితే జాసన్ ఎంట్రీ గురించి మరిన్ని వివరాలు..

విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి
గత కొద్దికాలంగా విజయ్ ఫ్యాన్స్‌ను ఒత్తిడి మొదలైంది. విజయ్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనే అభిమానుల్లో పలుమార్లు వినిపించింది. విజయ్‌కి కూడా తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఉంది కానీ.. సరైన కథ, సమయం కోసం వేచి చూస్తున్నారు అని మాస్టర్ నిర్మాత జేవియర్ బ్రిట్టో తెలిపారు.

కెనడాలో ఫిల్మ్ మేకింగ్‌లో
నిర్మాత జేవియర్ బ్రిట్టో తాజా ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ.. జాసన్ ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్నారు. అయితే జాసన్‌కు యాక్టింగ్‌పై అంతగా ఇష్టం లేదు కానీ డైరెక్టర్ కావాలనుకొంటున్నారు. యాక్టింగ్ వైపు వస్తారా లేదా అనే విషయం గురించి పెద్దగా అవగాహన లేదు. ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ శిక్షణ, డిగ్రీ పూర్తయిన తర్వాతే సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతారు అని జేవియర్ పేర్కొన్నారు.

గతేడాది షార్ట్ ఫిలింతో
గతేడాది జాసన్ సంజయ్ ఓ షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిరీ అనే చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నటించారు. వినోద ప్రధానంగా సాగిన ఆ షార్ట్ ఫిలింకు మంచి ప్రశంసలు లభించాయి. జాసన్ స్క్రీన్ ప్రజెన్స్, స్టైల్‌ను ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ షార్ట్ ఫిలిం ఇంటర్నెట్‌లో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది.

డైరెక్షన్‌పై జాసన్‌కు ఆసక్తి
జాసన్ సంజయ్‌కి యాక్టింగ్‌పైనే ఇంట్ట్రస్ట్ ఉంది. గతంలో తండ్రి నటించిన వెట్టైకరన్ చిత్రంలో విజయ్‌తో కలిసి నటించారు. విజయ్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకొంటున్నారు. ఇటీవల కాలంలో విజయ్‌పై అభిమానులు ఒత్తిడి పెంచుతున్నారు. విజయ్ కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు అని సన్నిహితులు పేర్కొంటున్నారు.
Recommended Video

మాస్టర్ రాక మరింత ఆలస్యం
ఇక విజయ్ నటించిన మాస్టర్ చిత్రం కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. ఏప్రిల్ విడుదలకు యూనిట్ ప్లాన్ చేస్తే లాక్‌డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. అయితే ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ వాటిని చిత్రం యూనిట్ ఖండించింది. అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ను దీవాళి నుంచి సంక్రాంతి 2020కి మార్చారు. దాంతో విజయ్ ఫ్యాన్స్‌లో నిరాశ పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











