డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
తలపతిగా తమిళనాడులో తనకంటూ భారీ క్రేజ్ అందుకున్న స్టార్ హీరో విజయ్ ఇప్పుడు మెల్లగా తెలుగు మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ వసూళ్లను అందుకోవడం కామన్. అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ గా నాలుగు హై వోల్టేజ్ సన్నివేశాలు ఉంటే చాలు కలెక్షన్స్ డోస్ మామూలుగా ఉండదు.
ఇటీవల మాస్టర్ సినిమా ఓపెనింగ్స్ తోనే విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి క్లారిటిగా అర్ధమయ్యింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా డబుల్ సెంచరీ కొట్టేసింది. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
కమిట్‌మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)

ఇక సినిమాకు మధ్యలో ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. ఇక థియేటర్స్ లో జనవరి 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ విజయం అనంతరం ఓటీటీలో కూడా సందడి చేయడానికి సిద్ధమైంది. మాస్టర్ అమెజాన్ ప్రైమ్ లో జనవరి 29న రానున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడు కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఓటీటీలో త్వరగా సినిమాను రిలీజ్ చేస్తుండడంతో ఒక విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులకు బ్రేక్ పడినట్లే. మరి సినిమా డిజిటల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











