ఎన్టీఆర్ అన్న వీరరాఘవ రెడ్డిగా జీవించాడు.. అరవింద సమేత విజయం వారిదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. సినీ విమర్శకుల నుంచి అరవింద సమేత చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్లు ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దసరా సెలవులు కూడా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వీర రాఘవుడు కలెక్షన్ల సునామి సృటించబోతున్నాడనే ఉహాగానాలు మొదలయ్యాయి. తాజగా ఈ చిత్రం విజయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు.

వీర రాఘవుడిగా జీవించాడు
అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్ర విజయం పట్ల తమన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. వీరరాఘవుడి పాత్రలో ఎన్టీఆర్ అన్న జీవించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అద్భుత చిత్రం వచ్చింది అని తమన్ తెలిపాడు.
ఈ విజయం వారిదే
అరవింద సమేత ఇంతటి ఘనవిజయం కావడానికి కారణం వీరే అంటూ తమన్ చిత్ర యూనిట్ లోని కొందరి పేర్లని ప్రస్తావించాడు. ఈ చిత్రానికి సినిమా టోగ్రాఫర్ గా పనిచేసిన పీఎస్ వినోద్, ఎడిటర్ నవీన్ నోలి, సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి, సిరివెన్నెల, నిర్మాత రాధాకృష్ణ పేర్లని తమన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

అద్భుతమైన సంగీతం
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఉన్నది నాలుగు పాటలే అయినా అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే పెనీవిటి సాంగ్ గురించి అంతా చెప్పుకుంటున్నారు. సినిమా ఎమోషన్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడని అంటున్నారు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రశంసలు
చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తమన్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తమన్ తప్ప ఈ చిత్రానికి మరొకరు సంగీతం అందించలేరని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇటీవల ప్రచార కార్యక్రమాలలో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. పెనీవిటి సాంగ్ ని తమన్ కేవలం 15 నిమిషాలలో కంపోస్ చేశాడని తెలిపారు. ఈ చిత్రంలో పాటలు బాగా రావడానికి ఎంతో కష్టపడ్డాడని తెలిపారు.


Click it and Unblock the Notifications











