ఎంకరేజ్ చేయొద్దు: ‘బాద్ షా’ సాంగ్ లీక్‌పై తమన్
హైదరాబాద్: జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'బాద్ షా'. ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఆడియో విడుదలకు ముందే ఈచిత్రంలోని 'సైరో సైరో' అనే సాంగు లీక్ అయి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీనిపై తమన్ అసంతృప్తి చేస్తూ తన ట్విట్టర్ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు.
'సాంగ్ లీక్ అవడం నన్ను చాలా బాధ పెట్టింది. దయచేసి ఇలాంటి అభిమానులు ఎంకరేజ్ చేయొద్దు. దీని లింక్స్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం ఆపండి. టెక్నాలజీ కొన్నిసార్లు థ్రిల్ ఇస్తుంది...కానీ ఒక్కోసారి ఇది మంచి స్టఫ్‌ను హరిస్తుంది. ఎంతో కష్టపడి చేసింది వృధా అయితే బాధగా ఉంటుంది, పైరసీని అరికట్టండి' అంటూ ట్విట్టర్లో పోస్టు చేసాడు.
కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల యూరఫ్, బ్యాంకాక్ షెడ్యూల్‌లో చిత్రీకరించిన షూటింగుకు సంబందించిన సీన్లను ఎడిట్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల దగ్గరుండి ఈ పనులు చేయిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











