Bheemla Nayak: వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయడం ఎందుకు? తమన్ రియాక్షన్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ చాలా రోజుల తర్వాత మరొక మంచి ఆరంభం మొదలైంది. భీమ్లా నాయక్ రాబోయే సినిమాలకు మరింత బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక సోమవారం నుంచి కూడా మంచి వసూళ్లు అందుతాయని నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమాలో అంతా బాగానే ఉంది కానీ ఎడిటింగ్ లో చివరి నిమిషంలో ఒక పాటను తీసేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ విషయం పై ఇటీవల సంగీత దర్శకుడు థమన్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మొదటి మూడు రోజుల్లోనే..
మలయాళంలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. మొదటి రోజే సినిమా 30 కోట్లకు పైగా షేర్ రాబట్టి మిగతా ఇండస్ట్రీ లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమాకు 60 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం.

మంగళవారం కూడా..
సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. శుక్రవారం శని ఆదివారాల్లో అయితే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక సోమవారం కాస్త తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ మంగళవారం రోజు శివరాత్రి కాబట్టి భీమ్లా నాయక్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మరోసారి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సినిమాలో మాస్ ఎలివేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పోటాపోటీగా నటించడం ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.

ఆ పాట లేకుండానే..
ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఒక పాట మాత్రం కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండే ఒక కూల్ మెలోడీ సాంగ్ అంత ఇష్టం ఏందయ్యా అనే పాటను తీసేశారు. ఒక విధంగా సినిమాకు ఆ పాట విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది.

అందుకే ఆ పాటను తీసేశారట
పాటను ఎందుకు తీసేసారు అనే వివరాల్లోకి వెళితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా అని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. అప్పటివరకు మంచి వేడి మీద కొనసాగుతున్న సినిమా అడ్డంకిగా కూల్ గా అనిపించే సాంగ్ ఏ మాత్రం బాగుండదు అని కారణం చేత ఆ పాటను తొలగించినట్లు వివరణ ఇచ్చాడు.

వారికి భరోసా..
ఇక మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో అయితే మంచి వసూళ్లను అందుకుంది. సోమవారం కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అయితే 108 కోట్లు సాధిస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతమంది బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఇక వారికి ముందుగానే పవన్ కళ్యాణ్ అలాగే నిర్మాతలు నష్టాలు వస్తే ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











