సింహం ఈ ఫారెస్ట్ అంతా నాదే అనేలా ఉండాలి.. మళ్ళీ కోడితున్నాం: పవన్ కళ్యాణ్‌తో మరోసారి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరో సాలీడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మూడేళ్ళ గ్యాప్ తరువాత వకీల్ సాబ్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అప్డేట్స్ చూస్తుంటే ఈజీగా 100కోట్ల మార్క్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ తదుపరి సినిమాలపై అంచనాల డోస్ మరింత పెరిగాయి.

మరోసారి రుజువయ్యింది

మరోసారి రుజువయ్యింది

బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ మిగతా భాషల్లో కంటే అత్యదిక ఓపెనింగ్స్ ను అందుకోవడం విశేషం. పవర్ స్టార్ లాంటి హీరో ఇలాంటి కథలో నటిస్తే బాక్సాఫీస్ వద్ద అలజడి ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి రుజువయ్యింది. మొత్తానికి మొదటి రోజే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

మహేష్ ట్వీట్ చేయడంతో

మహేష్ ట్వీట్ చేయడంతో

వకీల్ సాబ్ లో పవన్ యాక్టింగ్ కూడా చాలా కొత్తగా ఉందని ప్రాణం పెట్టి నటించాడని సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి అగ్ర హీరో వకీల్ సాబ్ పై ట్వీట్ చేయడంతో అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. ఇక సినిమా కలెక్షన్స్ రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి.

పవన్ తో మరోసారి థమన్

పవన్ తో మరోసారి థమన్

ఇక వకీల్ సాబ్ హిట్టవ్వడంతో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై కూడా అంచనాల డోస్ పెరిగాయి. ముఖ్యంగా థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ లో మాస్ సాంగ్స్ ఇవ్వడానికి కుదరలేదు. అయినప్పటికీ థమన్ కథకు తగ్గట్లు తన మార్క్ తో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక పవన్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించబోతున్న విషయం తెలిసిందే.

సింహం గర్జించినట్లు ఉండాలి

సింహం గర్జించినట్లు ఉండాలి

ఆ సినిమాలో థమన్ తన అసలు నిజ స్వరూపాన్ని చూపించబోతున్నట్లు చెప్పేశాడు. ఆ సినిమాకు థమన్ సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్. అయితే థమన్ తో మాటల మాంత్రికుడు ఒక విషయాన్ని చెప్పాడట. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండాలి అంటే.. సింహం ఈ ఫారెస్ట్ అంతా నాదే అని గర్జించినట్లు ఉండాలి.. అని ఒక్క మాటలో క్లారితో ఇచ్చేశారట.

 కొడుతున్నాం మళ్ళీ..

కొడుతున్నాం మళ్ళీ..

ఇటీవల ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని గుర్తు చేయగా.. ఇది మాస్.. కొడుతున్నాం మళ్ళీ.. అంటూ థమన్ వివరణ ఇచ్చాడు. దీంతో థమన్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ మ్యూజిక్ అంతకుమించి అనేలా ఉందని అర్ధమయ్యింది. ఇక ఆ సినిమాల్ రానా మరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X