Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ.. వకీల్ సాబ్ సందడి.. ఆసక్తి రేకెత్తిస్తోన్న తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అసలే మూడు నాలుగేళ్ల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేశారు. గతేడాది విడుదల చేసిన మగువా మగువా సాంగ్ ఓ రేంజ్లో క్లిక్ అయింది. అంతే కాకుండా వరుసగా వదులుతున్న పోస్టర్లు అంచనాలను పెంచేశాయి.
వకీల్ సాబ్పై రచ్చ..
వకీల్ సాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఏడాది నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ కరోనా, లాక్డౌన్ వంటి వాటి వల్ల సినిమా మొత్తంగా వాయిదా పడింది. అయితే వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే షెడ్యూల్స్ క్యాన్సిల్ అయిపోయింది.
మొత్తానికి పూర్తి..
అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వగానే సినిమా షూటింగ్‌ను చకచకా ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభించిన తరువాత లీకైన స్టిల్స్, పవన్ కళ్యాణ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్ బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మళ్లీ పవన్ కళ్యాణ్ తెరపై యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపనున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోయారు.
విడుదల తేదీ ఫిక్స్..
ఇక సమ్మర్లో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతోన్నాడని ప్రకటించేశారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ప్రకటించారు. వకీల్ సాబ్ రాకతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పాటల అప్డేట్..
వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో రామ జోగయ్య శాస్త్రి, దిల్ రాజు, వేణు శ్రీ రామ్, తమన్ ఇలా అందరూ కలిసి ఓ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తమన్ ఓ పోస్ట్ చేశాడు.
మార్చిలో పాటల సందడి..
మార్చిలో వకీల్ సాబ్ పాటల అప్డేట్లు ఇవ్వబోతోన్నట్టు ప్రకటించాడు తమన్. ఇక మార్చి మొత్తం వకీల్ సాబ్ సందడి ఉండబోతోందన్న మాట. సినిమా విడుదలకు నెల ముందే వకీల్ సాబ్ సోషల్ మీడియాలో సందడి సందడి చేయనున్నాడన్న మాట.