తమన్‌కు ఆ పిచ్చి ఉంది, డైరెక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తాడు: హరీష్ శంకర్
తెలుగులో దూసుకెలుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో సంగీత దర్శకుడు తమన్ ఒకరు. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్లందరితోనూ తమన్ పని చేశాడు. ఏఆర్ రెహమాన్ తప్పుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి నటించబోతయే 151వ సినిమా 'సైరా' నరసింహారెడ్డి' సినిమాకు కూడా తమనే సంగీతం అందించే అవకాశం ఉందని టాక్. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు.
Recommended Video

తమన్‌కు సంగీతం అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ అంటే కూడా అంతే పిచ్చి. ఇండియన్ టీమ్ క్రికెట్ మ్యాచ్ వస్తే తన వర్క్ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుకుంటాడట. కేవలం క్రికెట్ చూడటమే కాదు, ఖాళీ సమయాల్లో ఫ్రెండ్స్ తో కలిసి మ్యాచ్ ఆడతాడట.

అప్పుడప్పుడు కేవలం ఆట కోసమే హైదరాబాద్ వస్తాడు
టాలీవుడ్లో తమన్‌కు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. సమయం దొరికినప్పుడల్లా వారితో క్రికెట్ ఆడతాడు. కొన్ని సందర్భాల్లో కేవలం క్రికెట్ ఆడటానికే చెన్నైయ్ నుండి హైదరాబాద్ వస్తుంటాడట. తన కారులో ఎప్పుడూ క్రికెట్ కిట్ తప్పకుండా ఉంటుందని అతడి స్నేహితులు చెబుతుంటారు.

తమన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు
తమన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ అతడి గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. తమన్ కు క్రికెట్ అంటే పిచ్చి, క్రికెట్ గ్రౌండ్ లో డైరెక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, వారికి చాలా కండీషన్లు పెడతాడు, బాల్ స్లోగా వేయాలని, బౌండరీ కొట్టే విధంగా బంతి వేయాలని, తనను ఔట్ చేయవద్దు అని వారిని బెదిరిస్తుంటాడని.... హరీష్ శంకర్ సరదాగా వెల్లడించారు.

ట్యూన్స్ ఇవ్వను అని బెదిరిస్తాడు
క్రికెట్ ఆడే సమయంలో తాను పెట్టిన కండీషన్లు పాలో అవ్వక పోతే నీ సినిమాకు మంచి ట్యూన్లు ఇవ్వను అని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని, అందుకే అతడితో క్రికెట్ ఆడే సమయంలో అతడికి సపోర్టుగా ఉంటారని హరీష్ శంకర్ వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గరే ఎక్కువగా ఆడతారు
తమన్ తన స్నేహితులతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న క్రికెట్ పీల్డ్స్‌లో ఎక్కువగా ఆడతాడని, రాత్రి వేళలోనే వీరంతా ఎక్కువగా కలిసి మ్యాచ్‌లు ఆడతారని హరీష్ శంకర్ తెలిపారు.

తమన్ చేస్తున్న సినిమాలు
తమన్ ప్రస్తుతం తమిళంలో ‘స్కెచ్', తెలుగులో ‘దుర్గా', భాగమతి, జవాన్ చిత్రాలు చేస్తున్నారు. జవన్ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.

హరీష్ శంకర్ మూవీ
ఈ ఏడాది విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్' తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలేవీ ఇంకా అఫీషియల్ గా మొదలు కాలేదు.


Click it and Unblock the Notifications