జూ ఎన్టీఆర్, శ్రీను వైట్లకు వాయించేది అతడే...
జూనియర్ ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాకు సంగీతం వాయించే అవకాశం యువ సంగీత దర్శకుడు థమన్ దక్కించుకున్నాడు. థమన్ సంగీతం అందిస్తాడని గత కొన్ని రోజులుగా ఉహాగానలు వినిపిస్తున్నా..తాజాగా ఖరారైంది. థమన్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హీరో వచ్చిన బృందావనం చిత్రానికి, శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చి దూకుడు సినిమాకు సంగీతం అందించి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు థమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. దానికి తోడు మంచి సంగీతం అందిస్తాడనే పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు థమన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
థమన్ సంగీతం అందించిన బాడీగార్డు సినిమా పాటలు రెండు రోజు క్రితం విడుదలై శ్రోతల నుంచి మంచి స్పందన అందుకుంటున్నాయి. ఇది కాక రవితేజ నిప్పు, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలకు సంగీతం కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ యువ సంగీత దర్శకుడు. తాజాగా జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల చిత్రానికి జనవరిలో కంపోజింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' సినిమా చేస్తున్నాడు. సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











