రామ్ చరణ్- వినాయక్‌ సినిమా చాన్స్ అతనికే

By Bojja Kumar

యువ సంగీత దర్శకుడు తమన్ మరో భారీ బడ్జెట్ సినిమాకు వాయించే అవకాశం దక్కించుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఈ అవకాశం ద్వారా తమన్ తొలిసారిగా మెగా హీరో తో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. థమన్ ఇప్పటి వరకు సంగీతం అందించిన సినిమాలన్నీ ఆడియో పరంగానే కాక, సినిమాలు కూడా విజయవంతం అయిన నేపథ్యంలో థమన్ ను వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

చరణ్-వినాయక్ కాంబినేషన్లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X