మాయదారి జబ్బు-డేంజర్ జోన్‌లో తమన్!
ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న మాయదారి జబ్బుల్లో ఊబకాయం కూడా ఒకటి. ఈ జబ్బు మనకు తెలియకుండానే మన లైఫ్‌ను తగ్గిస్తుంది. అందుకే ఊబకాయం వచ్చిన వారంతా డాక్టర్ల సూచన మేరకు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి జబ్బే... యువ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను పట్టి పీడిస్తుందని ఆయన్ను చూసిన ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు.
అప్పుడెప్పుడో వచ్చిన బాయ్స్ సినిమాలో మనం చూసిన 'బండోడు"(తమన్) ఇప్పడు ఇంతింతై అన్నట్లు తెగ ఉబ్బి పోతున్నాడు. మణిశర్మ దగ్గర శిష్యరికం చేసిన తమన్ ఇప్పడు సొంతంగా సంగీత దర్శకత్వం చేస్తున్నాడు. ఆయన సంగీతం అందించిన పలు సినిమాలు ఆడియో పరంగా మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పడు తమన్ ఫుల్ బిజీ అయ్యాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఆయన సంగీతం కోసం క్యూకడుతున్నారు.
తన సత్తాను నిరూపించుకుని నెం.1 స్థానానికి ఎదగడానికి ఇదే మంచి సమయం కాబట్టి రాత్రింభవళ్లు తెగ కష్ట పడి పాటలు కంపోజ్ చేస్తున్నాడు. పనిలో పడి తన శరీరం గురించి పట్టించుకోవడమే మానేశాడట. ఇలా అయితే ఫ్యూచర్ లో తమన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది అంటూ పలువురు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











