Pushpa 2: తమన్ ను అక్కడికి పిలిపించుకొని దారుణంగా అవమానిస్తారా..? ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రూల్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై దుమ్మురేపుతోంది. 'పుష్ప' సినిమాతో మరోసారి తన సత్తా చాటిన అల్లు అర్జున్, ఇప్పుడు 'పుష్ప 2'తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. అయితే.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వివాదం నెలకొంది. దేవీ శ్రీ ప్రసాద్ పక్కన పెట్టి.. అజనీష్, తమన్, శ్యామ్ సీఎస్‌లనులను వాడుకున్నారు. కానీ,విడుదలైన తరువాత చూస్తే.. సంగీత దర్శకుడు తమన్ కు అవమానం జరిగిందా? అనిపిస్తోంది.
పుష్ప .. పుష్ప రాజ్ .. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అంటూ సినిమాలో ఉన్నట్లు విడుదలైన అన్ని చోట్లా పుష్పరాజ్ మ్యానియా భారీగా కనిపించింది. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. పాజివిట్ టాక్ తో సూపర్ డూపర్ హిట్ గా మారింది. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ కూడా దుమ్మురేపుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక వరకు అంత బాగున్నా.. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ విషయంలో వివాదం చెలారేగుతోంది. పుష్ప 2 సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన అవుట్ పుట్ నచ్చలేదని అజనీష్, తమన్, శ్యామ్ సీఎస్‌లనులను వాడుకున్నారట. కానీ, చివరకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ ను పక్కన పెట్టి.. ఫైనల్ గా శామ్ సిఎస్, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం(BGM)ను వాడారట. సినిమా టైటిల్స్ లో మ్యూజిక్ అండ్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కింద దేవిశ్రీ ప్రసాద్ పేరు.. అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో సామ్ సీఎస్ పేరు వేశారు మూవీ టీం. కానీ, టైటిల్స్ లో తమన్ పేరు లేకపోవడం గమన్హరం.
పుష్ప-2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంశంలో మ్యూజిక్ డైరెక్టర దేవి శ్రీ ప్రసాద్ కు తీరని అన్యాయం జరిగిందని, ఘోర అవమానం అనే వార్తలు వచ్చాయి. తీరా కట్ చేస్తే.. దేవి శ్రీ ప్రసాద్ కు కాదు.. తమన్ కే ఘోర అవమానం జరిగింది. పుష్ప-2 కోసం తమన్ ను తీసుకొచ్చి, ఆ తర్వాత అతడి వర్క్ చేయించుకుని పక్కనపెట్టారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో పాటు, సినిమా టైటిల్స్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఈ వివాదంపై శ్యామ్ సిఎస్ స్పందించారు. పుష్ప టు సినిమాకు దాదాపు 90% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తానే ఇచ్చానని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ అప్పటికే క్రియేట్ చేసిన కొన్ని సౌండ్డింగ్స్ను వాడుకున్నారు అంటూ మిగతా పనిని తాను పూర్తి చేశానని మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్లు వచ్చే బిజిఎం ను తానే ఇచ్చానంటూ ప్రకటించాడు. ఈ ప్రకటనతో పుష్పటు సినిమాలో తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను ఎక్కడ వాడలేదని స్పష్టమవుతుంది.

కానీ తమన్ పలుమార్లు తాను పుష్పట్టు సినిమాకు పని చేస్తున్నానని కేవలం 15 రోజులు మాత్రమే టైం ఉండడంతో తాను ఒక పార్ట్ కు మాత్రమే చేయగలుగుతున్నానని వెల్లడించారు భారీ బడ్జెట్ సినిమాలో తాను కూడా భాగమవుతున్నందుకు సంతోషించారు. కానీ రిలీజ్ తర్వాత తమన్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కనీసం పుష్ప సినిమా టైటిల్స్ క్రెడిట్ లో కూడా తమన్ పేరు లేకపోవడం వివాదానికి తెర తీసినట్లు అయ్యింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ కు కాదు తమన్ కి ఘోర అవమానం జరిగిందని. తమను పిలిచి మరి అవమానించారు అంటూ నేటిజెన్లు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ విషయం ఇండస్ట్రీలోనే కాదు అల్లు అర్జున్ ఆంటీ ఫ్యాన్స్ కూడా హార్ట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











