Guntur Karam: మీడియాపై తమన్ ఫైర్.. పట్టి పట్టి రాస్తున్నారంటూ అసహనం
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య తమన్ ను సినిమా నుంచి తప్పిస్తున్నారని తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై తమన్ ఇదివరకు ట్వీట్ల రూపంలో ఘాటుగానే స్పందించాడు. అయితే తాజాగా ఈ విషయంపై మరోసారి రియాక్ట్ అయ్యారు. గుంటూరు కారం నుంచి అతన్ని తీసివేస్తున్నారట కదా అనే ప్రశ్నకు తమన్ సమాధానం చెప్పిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.
అనుకున్నట్లుగా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, ఏదో ఒక కారణంతో చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమాను అనుకన్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే పూజా హెగ్డే, తమన్ ను తీసివేస్తున్నట్లు ఇటీవల వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

తాజా రియాక్షన్: గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. తర్వాత ఆమె స్థానాన్ని శ్రీలీల రీప్లేస్ చేసింది. అయితే ఇటీవలే పూజా హెగ్డేను హీరోయిన్ గా కాకుండా ఆమెతో స్పెషల్ సాంగ్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని మరో టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే సినిమాకు సంగీంతం అందించే తమన్ ను తీసేసినట్లు వచ్చిన న్యూస్ తెగ వైరల్ అయింది. దీనిపై ఇదివరకే తమన్ అనేకసార్లు రియాక్ట్ కాగా తాజాగా మరోసారి స్పందించారు.

దానిపైనే పడ్డారు: "మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. బయట ఏవేవే జరుగుతుంటాయి. ఏవేవో మాట్లాడుతుంటారు. నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్సే చెబుతారు కదా. అలాంటిది మనకు ఎందుకు నెగెటివిటీ. అలా టాక్ రావడానికి కారణం తెలియదు బ్రదర్. ఏం చెప్పాలి. అందరూ ఆ సినిమా పైనే పడ్డారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు" అని తమన్ అంటే.. అక్కడున్న రిపోర్టర్స్ నవ్వేశారు.

ఇప్పుడే ఎందుకు: "ఎవరికీ ప్లాప్ సినిమా తీయాలని ఉండదు. ఎవరికీ ప్లాప్ మ్యూజిక్ ఇవ్వాలని ఉండదు. ఎవరికీ నచ్చినట్లు వాళ్లు సినిమాలు తీసుకుంటాం. ఇది చాలా బేసింగ్ థింగ్ బ్రదర్. దీన్ని ఎందుకు పట్టి పట్టి టార్గెట్ చేస్తే ఎలా. ఎన్నో సినిమాలు ఆగి ఆగి షూటింగ్ చేసుకున్నాయి. రెండు మూడు ఏళ్లు షూటింగ్ చేసిన సినిమాలు ఉన్నాయి. అప్పుడు ఏం రాయలేదు. ఇప్పుడు ఎందుకు పట్టి పట్టి రాసేస్తున్నారు. ఏమని చెప్పాలి" అని తమన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
నటీనటులు: "మరి ఈ వార్తలపై మీ టీమ్ ఏమైన డిస్కషన్ పెట్టిందా" అని అడిగితే.. "అదేం లేదు. ఏం డిస్కషన్ పెట్టలేదు" అని తమన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











