మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొత్త బ్యాండ్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన క్లోజ్ ఫ్రెండ్స్ రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ తదితరులతో కలిసి కొత్త బ్యాండ్ ను ఏర్పాటు చేశాడు. తక్కలి(టమాటో) అని ఈ బ్యాండ్ కు పేరు పెట్టారు. సమ్మర్ తర్వాత దీన్ని అఫీషియల్ గా ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఈ బ్యాండ్ ద్వారా వీరు సినిమాలతో పాటు....పలు ఈవెంట్లలో లైవ్ షోలు ఇవ్వడం, మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించడం లాంటి చేయనున్నారట. ఓ లీడింగ్ న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ తమన్ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
తను సంగీతం అందించిన అన్ని చిత్రాలు ఇటు సంగీత పరంగా, అటు సినిమాలు కూడా విజయ వంతం అవుతున్న నేపథ్యంలో తమన్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కొంత మందైతే ఆయన ఉంటే చాలు సినిమా హిట్టవుతుందనే నమ్మకం కూడా పెట్టుకున్నారు. కానీ అన్ని సందర్భాలు ఓకేలా ఉండవు. ఇటీవల ఆయన సంగీతం అందించిన నిప్పు సినిమా అటు ఆడియో పరంగానే కాదు, ఇటు సినిమా కూడా నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ యువ సంగీత దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్-కాజల్ జంటగా రూపొందుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల వివి వినాయక్ తో కలిసి ఊటి వెళ్లారు.


Click it and Unblock the Notifications











