twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో నానికి థమన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఒకరి పేరు ఒకరు వాడుకోకుండానే ఇలా.. అసలు గొడవ అదేనా?

    |

    ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో థమన్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దాదాపు ఆయన చేస్తున్న ప్రతి సినిమా మ్యూజిక్ పరంగానే కాక బాక్సాఫీస్ పరంగా కూడా సూపర్ హిట్ గా నిలుస్తోంది. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే థమన్ ఇప్పుడు అనూహ్యంగా ఒక హీరో చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. థమన్ కౌంటర్ ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరు? అసలు ఏ విషయంలో థమన్ కౌంటర్ ఇచ్చాడు? అనే వివరాల్లోకి వెళితే

    ప్రశంసల వర్షం

    ప్రశంసల వర్షం

    తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. బడా హీరోలతో సినిమాలు చేస్తూ దాదాపు ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు అద్భుతమైన పాటలు అందిస్తున్నాడు. కేవలం పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు థమన్.

    మరీ ముఖ్యంగా తమ ఇటీవల చేసిన అఖండ సినిమా విషయంలో తమకు వందకు వంద మార్కులు పడ్డాయి. ఈ సినిమాకు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది అని సినీ విశ్లేషకులు మొదలు సామాన్య ప్రేక్షకులు కూడా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    ఏదో లెక్క తప్పిందని

    ఏదో లెక్క తప్పిందని

    అయితే అనూహ్యంగా అఖండ విషయంలో థమన్ ను టార్గెట్ చేస్తున్నట్లు హీరో నాని చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఇటీవల నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని సినిమా మ్యూజిక్ విషయంలో కొన్ని కామెంట్స్ చేశాడు.

    సినిమాను మ్యూజిక్ ఎలివేట్ చేసేలా ఉండాలి కానీ అది డామినేట్ చేసేలా ఉండకూడదు, పాట మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే యాక్టింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ డామినేట్ చేసే విధంగా ఉంటే అది ఒక్కటి మాత్రమే బయటికి బాగున్నట్లు కనబడుతుంటే ఏదో లెక్క తప్పిందని అర్థం అని ఆయన కామెంట్ చేశారు.

    కౌంటర్ వేసింది థమన్ కే

    కౌంటర్ వేసింది థమన్ కే

    పైన చెప్పినవన్నీ కలిపి ఒక సినిమాను అద్భుతమైన సినిమాగా చేయాలి కానీ ఒక్క మ్యూజిక్ మాత్రమే ఎలివేట్ అయితే అది లెక్క తప్పినట్లు నేను నమ్ముతాను అంటూ ప్రమోషన్స్ లో కామెంట్ చేశారు. అయితే ఎక్కడన్నా నానీ ఎవరి పేరును ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడక పోయినా సరే అఖండ విషయంలో సినిమాలో మిగతా అన్ని విషయాల కంటే బోయపాటి ఫైట్స్, థమన్ మ్యూజిక్ బాగా హైలైట్ అయ్యాయి. దీంతో ఆయనకు ఇండైరెక్ట్గా కౌంటర్ వేసింది థమన్ కే అని నెటిజన్లు భావిస్తున్నారు. థమన్ కూడా నేను ఏమీ తక్కువ తినలేదు అన్నట్లు సుదీర్ఘంగా ట్వీట్లు చేసి నాని చేసిన కామెంట్స్ కు కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు.

    స్మూత్ గా వెళ్లేలా

    స్మూత్ గా వెళ్లేలా

    అన్ని శాఖలు అద్భుతమైన పనితీరు కనబరిచినప్పుడు దానిని కంప్లీట్ ఫిలిం అని మేము అంటాం, ఎప్పుడూ ఒకరు డామినేట్ చేశారు అని అనరు, ఇదంతా వింటుంటే నవ్వొస్తోంది సినిమాను అర్థం చేసుకోవడానికి చాలా లోతైన అవగాహన అవసరం, డైలాగులలో డెప్త్, నెక్స్ట్ సీక్వెన్స్ లోకి స్మూత్ గా వెళ్లేలా నేరేషన్, అద్భుతమైన విజువల్ మరింత అద్భుతమైన క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్ లో నిజాయితీతో చక్కగా రాసిన స్క్రిప్ట్ కు ప్రోపర్ డైరెక్షన్, నటీనటులు అద్భుతమైన అభినయం తోడైనప్పుడే సినిమా బాగుంటుంది, సినిమా ఎప్పుడూ వన్ మ్యాన్ షో కాదు.

    మేం సినిమాను ప్రేమిస్తాం, సినిమా కోసం పని చేస్తాం" అని థమన్ చెప్పుకొచ్చాడు. అది ఇక్కడ కూడా థమన్ ఎవరినీ ఉద్దేశించి మాట్లాడకపోయినా నాని చేసిన కామెంట్లకు కౌంటర్ గానే ఈ విధంగా థమన్ మాట్లాడాడు అని భావిస్తున్నారు.

    అక్కడే చెడిందా?

    అక్కడే చెడిందా?

    నిజానికి నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ సినిమాకు ముందుగా థమన్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా థమన్ ని సినిమా నుంచి తప్పించి మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ను లైన్ లోకి తీసుకు వచ్చారు. టక్ జగదీష్ సినిమాకు సాంగ్స్ థమన్ ఇవ్వగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గోపీసుందర్ అందించాడు.

    అంతే కాక శివ నిర్మాణ స్వయంగా రాసిన ఒక పాటకు కూడా ఆయనే సంగీతం అందించాడు. బహుశా థమన్ ను ఈ సినిమా నుంచి తప్పించడం నాని తమ మధ్య దూరం పెరగడానికి కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదైతేనేం ఒక పక్క నాని మరో పక్క థమన్ కూడా తమ తమ సినిమాలలో బిజీగానే ఉన్నారు.

    బడా ప్రాజెక్టులకు

    బడా ప్రాజెక్టులకు

    ఈ ఏడాది క్రాక్, వైల్డ్ డాగ్, వకీల్ సాబ్ అఖండ, టక్ జగదీష్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థమన్ 2022 లో రాబోతున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అవి కాక గని, సర్కారు వారి పాట, థాంక్యూ, గాడ్ ఫాదర్, రామ్ చరణ్- శంకర్ సినిమా, నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ సినిమా, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా వంటి బడా ప్రాజెక్టులకు థమన్ పని చేస్తున్నాడు.

    English summary
    Thaman gives a strong counter to Hero Nani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X