India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం.. సీక్రెట్ లీక్ చేసిన థమన్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని సీక్వెల్స్, కొన్ని మల్టీస్టారర్ మూవీలు, కొన్ని రీమేక్ చిత్రాలు, మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అయితే, అన్నింట్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షించాయి. అందులో భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీ ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న ఈ ఫిల్మ్‌పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ అతడు ఏమని చెప్పాడు? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  Bheemla Nayak New Release Date Announced | Pawan Kalyan| Rana Daggubati
  భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

  భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

  పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా వస్తోన్న దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  ఆ మూవీ రీమేక్.. హీరోల పాత్రలు

  ఆ మూవీ రీమేక్.. హీరోల పాత్రలు

  మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా రివీల్ అయ్యాయి.

  అవన్నీ సూపర్ హిట్టే.. రెట్టింపుగా

  అవన్నీ సూపర్ హిట్టే.. రెట్టింపుగా

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

  Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

  రిలీజ్ డేట్ వాయిదా.. జెట్ స్పీడ్

  రిలీజ్ డేట్ వాయిదా.. జెట్ స్పీడ్


  వాస్తవానికి 'భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. దీంతో షూటింగ్‌ను కూడా నిలిపేసి, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రం జెట్ స్పీడుతో సాగిస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి మొదటి వారానికల్లా టాకీ పార్ట్ పూర్తి చేస్తారట.

  సినిమా అంచనాలు పెంచేశాడు

  సినిమా అంచనాలు పెంచేశాడు

  'భీమ్లా నాయక్' మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడ్డాయి. సినిమా మొత్తం తన మార్కు చూపించాలని తెగ కష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా థమన్.. 'భీమ్లా నాయక్' గురించి కొన్ని విషయాలు లీక్ చేసి అంచనాలు పెంచాడు.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  పవన్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అని

  పవన్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా అని


  తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. భీమ్లా నాయక్ మూవీ గురించి మాట్లాడుతూ.. 'త్రివిక్రమ్ గారు, నేను సినిమా రష్‌లను చూశాము. పవన్ కల్యాణ్ గారికి ఈ సినిమా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను చెప్పగలను. ఈ మూవీకి నా వైపు నుంచి అత్యుత్తమ అవుట్‌పుట్‌ను అందించాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Now Thaman Increased Expectations on This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X