ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పర్సన్...!?
2011కి తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి అసలు సిసలైన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరంటే సంగీత దర్శకుడు తమన్ అనే చెప్పాలి. గత ఏడాదిలోనే మొదలైన తన హవా ఈ ఏడాదిలో ఉదృతమయింది. పెద్ద హీరోల సినిమాలకి పని చేసే అవకాశాలు వరుసగా వచ్చాయి. వచ్చిన అవకాశాల్ని తమన్ సద్వినియోగం చేసుకున్నాడు. అదృష్టం కూడా అతనితోనే ఉందేమో తమన్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు.
ఇప్పుడతని జోరు ఎలా ఉందంటే కేవలం సంక్రాంతికే అతనివి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. మహేష్ దూకుడు కి మ్యూజిక్ అందించి మళ్ళీ మహేష్ 'బిజినెస్ మ్యాన్", వెంకటేష్ 'బాడీగార్డ్", రవితేజ'నిప్పు" సినిమాలు వరుసగా జనవరి 11,12,13 తేదీల్లో విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు ఏకకాలంలో విడుదలవుతున్నా కానీ కాస్త కూడా తడబడకుండా అన్నింటికీ సమయానికి పాటలు పూర్తి చేసి ఇవ్వడమే కాక రీరికార్డింగ్ కూడా చాలా వేగంగా చేసేస్తూ తన దూకుడుతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు...


Click it and Unblock the Notifications











