Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'లవ్ ఫెయిల్యూర్' సెకండ్ హీరో తమన్
తమన్ 'దూకుడు', 'బిజినెస్‌మేన్' సినిమాలతో మంచి టచ్‌లో ఉన్నాడు. ఇందులో చాలా మంచి బాణీలిచ్చాడు. రెండు పాటలకు నా వాయిస్ అయితే బాగుంటుందని నాచేత పాడించాడు. ఇందులోని పాటలు ఇప్పుడు ఎఫ్.ఎమ్.లో మారుమోగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి రెండో హీరో తమనే అంటున్నాడు సిద్దార్ధ. ఆయన తాజా చిత్రం లవ్ ఫెయిల్యూర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించాడు. బెల్లంకొండ సురేశ్ సమర్పణలో ఎటాకి ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'లవ్ ఫెయిల్యూర్'లో ఆయన హీరోగా నటించారు. ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్ ఆయనదే. నూతన దర్శకుడు బాలాజీ మోహన్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 17న (శుక్రవారం) విడుదలవుతోంది.
అలాగే చిత్రం గురించి మాట్లాడుతూ..ఈ రోజుల్లో లవ్ ఫెయిల్ కాగానే కుర్రాళ్లు గడ్డాలు పెంచేసుకొని, బాగా మందు కొట్టేసి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. జీవితం అంటే అది కాదు. ప్రపంచంలో చాలామంది అమ్మాయిలున్నారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది కాబట్టి లైట్ తీసుకొమ్మని చెప్పే సున్నితమైన సందేశం ఉండే సినిమా ఇది. 'లవ్ సక్సెస్' అని పెడితే రొటీన్‌గా ఉందని తీసేస్తారు అన్నారు. ఇక 'ధూమ్', 'ధూమ్2', 'బిల్లా' సినిమాలకు పనిచేసిన నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పారు.