కన్నీరు ఆగడం లేదు.. ప్లీజ్ మామా త్వరగా రండి.. ఎస్పీబీపై తమన్ ఎమోషనల్

ప్రస్తుతం దేశం మొత్తం ఒక్కటే కోరుకుంటుందో.. ప్రపంచ సంగీత ప్రేమికులందరీ ప్రార్థన ఒక్కటే. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కరో్నా పోరాడి జయించారు. ఆరోగ్యం స్థిమిత పడుతోందని అందరూ అనుకుంటున్న వేళ మళ్లీ అందోళనలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఎస్పీబీ ఆరోగ్యం విషమించిందనే వార్తలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, తొందరగా కోలుకోవాలని సెలెబ్రిటీలందరూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఇది తప్పదని తెలుసు..

ఇది తప్పదని తెలుసు..

ఇది మనందరికీ తప్పదని తెలుసు.. అయినా సరే నొప్పిగా ఉంది.. చాలా బాధ పెడుతోంది.. ఇది నిజం కాకూడదని ఆశిస్తున్నాను.. ప్రార్థిస్తున్నాను. ఓ గాండ్ అంటూ కృష్ణవంశీ కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. ఇక ఆ ట్వీట్ చేసిన నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ ఏడాది ఎందుకిలా ఉంది..

ఈ ఏడాది ఎందుకిలా ఉంది..

ద్వేషం అనే పదం నాకు భారంగా ఉంటుంది.. కానీ ఈ ఏడాదిని నేను ఎంతో ద్వేషిస్తున్నాను. హృదయం బద్దలయ్యే వార్తలు వింటూనే ఉన్నాను అంటూ రాధిక ఎమోషనల్ అయింది. నిన్న రాత్రి రాధిక చేసిన ఈ ట్వీట్ అందర్నీ ఆందోళనలో పడేసింది.

మామా మామా ప్లీజ్..

మామా మామా ప్లీజ్..

లాక్ డౌన్‌కు ముందు మ్యూజిషియన్స్ అందరూ కలిసి పాల్గొన్న ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తమన్ ఎమోషనల్ అయ్యాడు. ఏడుపొస్తుంది.. ప్లీజ్ మామా రండి మామా.. త్వరగా కోలుకుని రండి మామా అంటూ ఎస్పీబీపై ప్రేమను కురిపించాడు తమన్. మీ అందరి ప్రార్థనలు కావాలి.. అందరం కలిసి ప్రార్థిద్దాం.. లవ్యూ మామ అంటూ తమన్ చేసిన ట్వీట్‌కు అందరూ ఎమోషనల్ అవుతున్నారు.

మంచు లక్ష్మీ ఎమోనల్

మంచు లక్ష్మీ ఎమోనల్

మీతో మా ప్రయాణం.. మాతో మీ ప్రయాణం ఇంకా పూర్తవ్వలేదు.. ఈ కష్టాన్ని ఎదురించి మా కోసం తిరిగి రండి.. దేవుడా ఇది నీ టైం.. నీ దయను మా మీద చూపించు అంటూ మంచు లక్ష్మీ ఎమోషనల్ అయింది. కేవలం తెలుగు సింగర్సే కాకుండా ప్రతీ ఒక్క సెలెబ్రిటీ, సామాన్య జనం ఎస్పీబీ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X