'దూకుడు'పంక్షన్ లో హైలెట్ అదేనట
మహేష్ 'దూకుడు'చిత్రం యాభై రోజుల పంక్షన్ విజయవాడలో ఈ నెల 12 వ తేదీన ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పంక్షన్ లో హైలెట్ గా మ్యూజిక్ డైరక్టర్ తమన్ పోగ్రాం హైలెట్ కానుందని సమాచారం.దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తమన్ ఇలాంటి స్టేజ్ పోగ్రాం చేసారు.అప్పట్లో ఆయన జి ఆనంద్ టీమ్ లో ఉండి డ్రమ్స్ ప్లే చేసారు.మళ్లీ ఇన్నాళ్లకు ఆయన స్టేజీ పై చేసే మ్యూజిక్ పోగ్రాం హైలెట్ కానుందని తెలుస్తోంది.ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు.అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
ఇక నిర్మాతలు ఈ పంక్షన్ గురించి మాట్లాడుతూ.. "ఎనభై ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లతో, అత్యధిక కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటూ అన్ని రికార్డుల్ని తిరగరాసిన 'దూకుడు' చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో ఈ నెల 12 సాయంత్రం 5 గంటలకు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో వైభవంగా జరుపుతున్నాం.ఈ వేడుకలో చిత్రసీమ అతిరథ, మహారథులతో పాటు సినిమా యూనిట్ అంతా పాల్గొంటుంది.'దూకుడు'కు అఖండ విజాన్ని అందించి ఇండస్ట్రీ నెంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిపిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు''అని చెప్పారు. మహేశ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'దూకుడు' చిత్రాన్ని జి. రమేశ్‌బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించారు.


Click it and Unblock the Notifications











