రామ్ చరణ్-కృష్ణ వంశీ సినిమాకు మ్యూజిక్ ఎవరంటే..?

By Bojja Kumar

Thaman music for Ram Charan
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఖరారయ్యాడు. ఈ చిత్రానికి టాలీవుడ్లో ఫాంలో ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్‌ను ఎంపిక చేసాడు. ఇంతకు ముందు తమన్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. కృష్ణ వంశీ సినిమాల స్టైల్లో తెరకెక్కే ఈచిత్రానికి భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా రిచ్ లుక్‌తో అదరిపోయే ఫ్యామిలీ సబ్జెక్టుతో ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభ విషయాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాపై ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం స్టోరీ లైన్ హిందీ మూవీ 'కభి ఖుషీ కభి ఘమ్' స్టోరీని పోలి ఉంటుందట. ఏది ఏమైనా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తొలుత ఈ చిత్రాన్ని రామ్ చరణ్-వెంకటేష్‌లతో మల్టీ స్టారర్ మూవీగా ప్లాన్ చేసారు. కానీ తర్వాత వెంకటేష్ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేక పోవడం, రామ్ చరణ్‌కే కథలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం, బల్క్ డేట్స్ కావాల్సి రావటంతో వెంకటేష్ తప్పుకోవటానికి కారణాలు గా చెప్తున్నారు. వెంకటేష్ స్థానంలో శ్రీకాంత్‌ను తీసుకున్నారు. ఈచిత్రంలో చరణ్ బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X